ETV Bharat / bharat

ఈవీఎం హ్యాకింగ్ ఫేక్​ న్యూస్​పై ఎఫ్ఐఆర్​ - ఎన్నికల కమిషన్ ఫేక్ న్యూస్

ఈవీఎంల పనితీరుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 2017లో వచ్చిన ఈ వార్తలు మళ్లీ ఎన్నికల వేళ ప్రచారం అవుతున్నాయని వెల్లడించింది.

ec
ఈవీఎం హ్యాకింగ్ వార్తలపై ఎఫ్ఐఆర్​ నమోదు
author img

By

Published : Mar 12, 2021, 6:28 AM IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్​ మెషీన్​(ఈవీఎం)లు హ్యాకింగ్​కు గురవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్​ ఎఫ్ఐఆర్​ నమోదు ​చేసింది. ఇందుకు సంబంధించి ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఈ చర్య చేపట్టినట్టు వెల్లడించింది. దర్యాప్తు ప్రారంభమైందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

"సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త 2017 డిసెంబరు 21వ తేదీకి చెందినది. ఈవీఎంలు హ్యాక్​ అవుతాయంటూ ఈ నకిలీ వార్తలు పేర్కొంటున్నాయి. ఇందులో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్​ టీఎస్ కృష్ణమూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఫలానా పార్టీ ఈవీఎంలు హ్యాక్​ చేయడం ద్వారా ఎన్నికలు గెలిచిందని కృష్ణమూర్తి పేర్కొంటున్నట్టు తప్పుడు సమాచారం ఇస్తోంది. 2018లో ఈ నకిలీ వార్తలు కృష్ణమూర్తి దృష్టికి రాగా.. ఆయన వీటిని ఖండించారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడం గమనార్హం."

-ఎన్నికల కమిషన్​

"కొన్నాళ్ల క్రితం ఓ హిందీ వార్తాపత్రికలో వచ్చిన తప్పుడు వార్త ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోందని తెలిసింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈవీఎంల పనితీరులో ఎలాంటి సందేహాలు అక్కరలేదు."

-టీఎస్ కృష్ణమూర్తి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్

ఇదీ చదవండి : నందిగ్రామ్‌ ఘటన: టీఎంసీ ఆరోపణలపై ఈసీ రియాక్షన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.