అసోంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. రాటబరి, సోనాయ్, హాఫ్లాంగ్ నియోజకవర్గాల్లో ఉన్న ఈ నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రక్రియ చేపట్టాలని అసోం ఎన్నికల ప్రధాన అధికారికి స్పష్టం చేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరపాలని ఈసీ పేర్కొంది.
అసోంలో ఏప్రిల్ 1న జరిగిన రెండో విడత ఎన్నికల్లో రాటబరి, సోనాయ్, హాఫ్ లాంగ్ నియోజవర్గాల్లోని నాలుగు కేంద్రాల్లో పోలింగ్ సక్రమంగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయ. ఈ కారణంగా రీపోలింగ్‌కు ఈసీ అనుమతించింది.
ఏప్రిల్ 6న మూడు విడతల్లో అసోం ఎన్నికలు పూర్తియ్యాయి. మే 2న ఫలితాలు రానున్నాయి.
ఇదీ చదవండి: అమిత్ షా రాజీనామాకు దీదీ డిమాండ్
ఇదీ చదవండి:ప్రశాంత్ కిశోర్ నోట భాజపా అనుకూల మాట!