ETV Bharat / bharat

Earthquake news: ఆ రాష్ట్రాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు - ఝార్ఖండ్​ భూకంపం

ఝార్ఖండ్, అసోంలో ఆదివారం భూకంపం (Earthquake news) సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.8 తీవ్రత నమోదైంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Earthquake with 4.1 magnitude hits Jharkhand, 3.8 magnitude hits assam
భూకంపం, ఝార్ఖండ్​, అసోం భూకంపం
author img

By

Published : Oct 3, 2021, 8:36 PM IST

రెండు రాష్ట్రాల్లో భూకంపం (Earthquake news) ధాటికి ప్రజలు వణికిపోయారు. తొలుత ఝార్ఖండ్​ సింహ్​భూమ్​లో మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై 4.1 తీవ్రత నమోదైంది. 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అసోంలో..

అసోంలోనూ భూప్రకంపనలు (Earthquake news) సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 3.8గా నమోదైంది. శోణిత్​పుర్​లో 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సెప్టెంబర్​ 29న కూడా అసోం తేజ్​పుర్​లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.