Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్‌పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
![Earthquake in Bangalore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ckb-01-22-erthquick-av-ka10046_22122021094422_2212f_1640146462_833_2212newsroom_1640150241_1021.jpg)
- మొదటి సారి: చిక్కబళ్లాపుర జిల్లాలోని మండికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉదయం 10.05 గంటలకు భూమి కంపించినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రామానికి 1.4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. రికార్ట్ స్కేల్‌పై 2.9 తీవ్రత నమోదైనట్లు తెలిపారు.
- రెండోసారి: చిక్కబళ్లాపుర తాలుకా, అడ్డగళ్లు గ్రామ పంచాయతీ పరిధిలోని భోగపర్తి గ్రామానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 1.23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.15 గంటలకు భూమి కంపించిందని, రికార్ట్ స్కేల్‌పై తీవ్రత 3గా నమోదైనట్లు తెలిపారు.
ఆందోళన వద్దు..
తీవ్రత స్వల్పంగానే ఉన్నందున భూ ప్రకంపనలు 10-15 కిలోమీటర్లకు మాత్రమే వ్యాపించి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇలాంటి భూకంపాలు ఎలాంటి ప్రభావం చూపవన్నారు. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తాయన్నారు. తీవ్రత తక్కువగానే ఉన్నందున ప్రజలు ఆందోళనకు గురికావద్దని సూచించారు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం డైరెక్టర్.
![Earthquake in Bangalore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ckb-01-22-erthquick-av-ka10046_22122021094422_2212f_1640146462_164_2212newsroom_1640150241_126.jpg)
ఇదీ చూడండి: