అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పని చేస్తోన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.
గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్ఎఫ్ఆర్) అండర్ బ్రిడ్జ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనలో మరో ఏడుగురు కూలీలను స్థానిక సిబ్బంది కాపాడినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:'ఆ సరస్సుతో ఇక ప్రమాదం లేదు'