ETV Bharat / bharat

మరుగుజ్జుల 'మళ్లీ పెళ్లి'.. వాటికోసమే రెండోసారి వివాహం - బీహార్‌లో వింత వివాహం

బిహార్​కు చెందిన ఇద్దరు మరుగుజ్జు దంపతులు.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితం మొదటి సారి గుడిలో పెళ్లి చేసుకున్న వీరిద్దరు.. రెండో సారి రిజిస్ట్రర్​ ఆఫీస్​లో ఒక్కటయ్యారు. వారిద్దరు మరోసారి ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

dwarfs-couple-remarriage-in-bihar-for-government-help
మరుగుజ్జుల మళ్లీ పెళ్లి
author img

By

Published : Jun 7, 2023, 10:35 AM IST

వారిద్దరు మరుగుజ్జులు. ఏడు నెలల క్రితమే ఓ గుడిలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం రిజిస్టర్​ ఆఫీస్​లో చట్టపరంగా ఒక్కటయ్యారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసమే.. మరోసారి పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు. బిహార్​లోని సీతామడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఇదీ అసలు కథ
25 ఏళ్ల యోగేంద్ర​.. దుమ్రా బ్లాక్‌లోని రాంపుర్ పరోరి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడి ఎత్తు 3 అడుగులు. దీంతో ఇతడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే సీతామడి సిటీలోని లోహియా నగర్​కు చెందిన 3.5 అడుగుల ఎత్తున్న పూజా(21) గురించి తెలిసింది. దీంతో ఆమె కుటుంబసభ్యులను సంప్రదించి.. 2022 నవంబర్​లో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. సీతాదేవి స్వగ్రామమైన పునౌర ధామ్​లో వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే, కులాంతర వివాహం చేసుకున్న వీరికి.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందని తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ సాయం పొందాలంటే చట్టపరంగా వివాహం చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు. దీంతో స్థానిక రిజిస్ట్రర్​ ఆఫీస్​లో వీరిద్దరు మరోసారి ఒక్కటయ్యారు.

dwarfs couple Remarriage in bihar for government help
మరుగుజ్జు దంపతులు యోగేంద్ర, పూజ

"కులాంతర వివాహ పథకం కింద మాకు రూ. 2.5 లక్షల సాయం అందుతుంది. దాంతో పాటు దివ్యాంగుల సాయం కింద మరో లక్ష రూపాయలు సైతం అందుతాయి. అయితే మేము గుడిలో పెళ్లి చేసుకున్న కారణంగా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందలేదు. అందుకే జూన్​ 5న స్థానిక రిజిస్టర్​ ఆఫీస్​లో చట్టపరంగా మరోసారి పెళ్లి చేసుకున్నాం." అని యోగేంద్ర తెలిపాడు. మళ్లీ పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని యోగేంద్ర భార్య పూజా తెలిపింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి వార్తల్లో నిలిచిన యోగేంద్ర.. తాజాగా రెండో సారి పెళ్లీ చేసుకుని చర్చనీయాశంగా మారాడు.

ఒక్కటైన మరుగుజ్జు జంట.. అంగరంగ వైభవంగా పెళ్లి..
కొద్ది రోజు క్రితం ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మరుగుజ్జు జంట కూడా వివాహ బంధంతో ఒక్కటైంది. అలీగఢ్​ జిల్లాలోని జీవన్​గఢ్​ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఇమ్రాన్​ ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నవాడు. ఇమ్రాన్​ పొడవు కేవలం 3 అడుగుల 4 అంగుళాలే. దీంతో ఇమ్రాన్​కు తగ్గ వధువు దొరకడం కష్టంగా మారింది. ఇమ్రాన్​ హాటల్​లో పనిచేస్తూ.. తన తల్లి బిర్జిస్​తో కలిసి ఉంటున్నాడు. ఇమ్రాన్​కు తగ్గ వధువు కోసం కుటుంబసభ్యులు వెతికే పనిలో ఉండగా..​ తల్లి బిర్జిస్​కు పట్వారీ నాగ్లాలోని భగవాన్​గడి ప్రాంతానికి చెందిన 3 అడుగుల పొడవుండే ఖుష్బూ గురించి తెలిసింది. వెంటనే ఇమ్రాన్​ తల్లి.. ఖుష్బూ కుటుంబసభ్యులతో మాట్లాడింది. వారు కూడా పెళ్లికి అంగీకరించారు. పెళ్లి కోసం ఇమ్రాన్​ను.. అతని కుటుంబసభ్యులు తలపాగాతో పాటుగా నోట్ల దండ వేసి ముస్తాబు చేశారు. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.