ETV Bharat / bharat

సేవాసమితి అండతో తీరిన అక్కాచెల్లెళ్ల కష్టాలు - దుర్గాపరమేశ్వరి సేవా సమితి

వారు ముగ్గురూ.. ఆడపిల్లలు. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. శిథిలావస్థకు చేరుకున్న నివాసం. ఇంటి కోసం సాయం అడిగితే స్పందించని ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ ఉచిత పథకాలకు అర్హులుకారని తేల్చేసిన అధికారులు! ఇదీ వారి దీన పరిస్థితి. వీరి కష్టాలను గుర్తించిన ఓ సేవా సమితి సభ్యులు తలో చెయ్యి వేసి.. వీరి కలను నిజం చేశారు. రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టి సొంతిల్లు కట్టించారు. వారి ముఖాల్లో వెలుగులు నింపారు.

Durgaparameshwari Seva Samiti, a light for poor girls
ఆ అమ్మాయిల ఇంటికల నిరవేర్చిన సేవాసమితి
author img

By

Published : Jan 28, 2021, 10:19 AM IST

ఆ అమ్మాయిల సొంతింటి కల నెరవేర్చిన సేవాసమితి

కర్ణాటక మంగళూరులోని ముగ్రోడి శ్రీ దుర్గాపరమేశ్వరి సేవా సమితి.. అనాథలైన ఓ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలిచింది. ఉండడానికి సరైన వసతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆపన్న హస్తం అందించింది.

ఊహ తెలిసే నాటికే తల్లిదండ్రులు కాలం చేసినా.. 'మేమున్నాం..' అంటూ వారికి అండగా నిలిచింది. ఇంట్లో ఉండాలంటే.. పై కప్పు ఎక్కడ ఊడి పడుతుందో అనే భయంతో ఏడేళ్లు కాలం వెళ్లదీసిన యువతులకు సొంతింటి కలను నిజం చేసింది. ప్రభుత్వ పథకాలకు అర్హులు కారని అక్కచెల్లెళ్లలో పెద్ద అయిన శాంభవికి అధికారులు తేల్చి చెప్పినా.. రాజకీయ నాయకులు స్పందించకపోయినా.. సేవా సమితి సభ్యులు తలో చెయ్యి వేసి కష్టాల కడలి నుంచి వారిని గట్టెకించారు.

దాతల సాయంతో ఇంటి నిర్మాణం..

ఇంతకాలం శిథిలావస్థలో ఉన్న ఇంటిని చూసిన దుర్గాపరమేశ్వరి సేవా సమితి సభ్యులు.. అక్కాచెల్లెళ్లకు కొత్త ఇల్లు కట్టించారు. ఇందుకుగాను తెలిసిన వారి నుంచి ఒక్కోరూపాయిని సేకరించారు. మొత్తం రూ. 7.50 లక్షలు కూడగట్టారు. దగ్గరుండి మరీ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. చివరగా వారితో గృహప్రవేశం చేయించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

"ముగ్రోడి శ్రీ దుర్గాపరమేశ్వరి సేవా సమితి వారి రుణం తీర్చుకోలేనిది. ఇన్నాళ్లుగా పాత ఇంట్లో.. గుండె చేతిలో పెట్టుకుని బతికాం. మాకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించిన లాభం లేకుండాపోయింది. ముగ్రోడి శ్రీ దుర్గాపరమేశ్వరి సేవా సమితి సభ్యులకు మా కృతజ్ఞతలు."

-శాంభవి, ఇంటి పెద్ద

ఇదీ చూడండి: ఈ 'పిల్లి కళ్లు' చూడటానికి రెండు కళ్లు చాలవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.