పాతకక్షల కారణంగా కొందరు దుండగులు ఓ యువకుడి రెండు చేతులను అతిదారుణంగా నరికేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లా చోరహట్ గ్రామంలో జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
బాధితుడు సోమేశ్ చౌదరి బాబయి పట్టణం నుంచి చోరహట్ గ్రామానికి తిరిగివస్తుండగా మార్గమధ్యంలో వెంకట్, కేశవ్, భగవాన్ సింగ్, నాతీ చౌదరి సహా మరో ముగ్గురు అతడిని అడ్డుకున్నారు. అతడిపై దాడి చేసి.. ఆ తర్వాత వారు తెచ్చిన తల్వార్తో రెండు చేతులూ నరికేసి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు ముందు రోజు.. బాధితుడు నిందితుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ దుర్ఘటనకు దారి తీసిందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్తో రేప్ కేసు దోషికి విముక్తి.. కానీ...