- " class="align-text-top noRightClick twitterSection" data="">
Dubbaka, Telangana Assembly Election Results 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న దుబ్బాకలో కారు జోరు చూపింది. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలో ఉన్నా, భారత్ రాష్ట్ర సమితికి(BRS) చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డినే విజయం వరించింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన భారీ విజయం సాధించడం విశేషం.
రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్త ప్రభాకర్ రెడ్డి మొదటిసారిగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 30న ఓ దుండగుడు చేతిలో ప్రమాదానికి గురైన ఆయన సుమారు 20 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొత్త ప్రభాకర్ రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త ఒక్కో ప్రభాకర్ రెడ్డి లాగా ఆయన గెలుపుకు కృషి చేశారు. కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులైన భార్య మంజులత, కుమారుడు పృథ్వీ కృష్ణారెడ్డి, పార్టీ ఆదేశాలు మేరకు మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్‌లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు.
Telangana Assembly Election Results 2023 Live : ఈ ఎన్నికల్లో గెలుపొందడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ల కల సాకారమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Dubbaka Election Results 2023 Live : త్రిముఖ పోరు ఉంటుందనుకున్నప్పటికీ, ప్రతి రౌండ్‌లోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంతో స్పష్టమైన మెజార్టీ సాధించారు. దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీకు చెందిన రఘునందన్ రావు ఈసారి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి బరిలోకి దిగిన చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రచారం సమయంలో ఊహించని రీతిలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి అంశం, ఒక్కసారిగా సమీకరణాలు మార్చేసిందనే చెప్పాలి. ఈ దాడి అంశం కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపినట్లే తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌కు సానుభూతి ఓట్లు తీసుకొచ్చి గెలుపు పీఠం ఎక్కించిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు
ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాణ టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా