ETV Bharat / bharat

మత్తులో దారుణం.. శునకం చెవులు, తోకను కత్తిరించి మందులోకి స్టఫ్​గా.. - uttarpraesh latest updates

మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఇద్దరు మందుబాబులు. తమ క్రూరత్వాన్ని శునకం పిల్లలపై చూపించారు. వాటి చెవులు, తోక కత్తిరించి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలి జిల్లాలో జరిగింది.

drunkards-cut-off-ears-and-tails-of-puppies-in-bareilly
puppy
author img

By

Published : Dec 14, 2022, 3:52 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మందుబాబులు రెచ్చిపోయి రెండు కుక్కపిల్లలను గాయపరిచారు. కుక్క చెవులను కత్తిరించి మందుతో కలిపి సేవించారు. మానవత్వాన్ని మంట గలిపే విధంగా ఉన్న ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ బరేలి జిల్లాలోని ఫరీదాపూర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.
వివరాలివి..
ఫరీదాపుర్​కు చెందిన ముఖేశ్ వాల్మీకి తన స్నేహితుడితో కలిసి మందు తాగాడు. మద్యం మత్తులో అటుగా వెళుతున్న రెండు కుక్కపిల్లలను పట్టుకుని ఇద్దరూ హింసించారు. దీంట్లో ఓ కుక్క పిల్ల చెవులను కోయగా.. మరో కుక్క పిల్ల తోకను గాయపరిచారు. అక్కడితో ఆగకుండా కోసిన కుక్క చెవులను వెంటతెచ్చుకున్న మందుతో కలిసి సేవించారు.

drunkards-cut-off-ears-and-tails-of-puppies-in-bareilly
కుక్కపిల్లలు

అక్కడే ఉన్న స్థానికులు.. జంతువుల కోసం పనిచేసే పీఎఫ్​ఏ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సంస్థ రెస్క్యూ ఇన్​ఛార్జి ధీరజ్​ పాఠక్.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకం పిల్లలను జంతు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శునకం పిల్లలు చికిత్స పొందుతున్నాయి. నిందితులపై ఫరీదాపుర్​ పోలీసు స్టేషన్​లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ధీరజ్. జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.