గణేశ్ ఫొటో స్టాంపుల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలోని ఇద్దరిని బెంగళూరు సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరిని కేరళకు చెందిన అరుణ్ ఆంటోని, గణేశ్, అమల్ బైజుగా గుర్తించారు.
అరుణ్ అంటోని.. హెబ్బుగొడి వద్ద జిరాక్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేరళ కొట్టాయం నుంచి డ్రగ్స్ కొరియర్లో వచ్చినట్టు గుర్తించామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో.. మొత్తం రూ.15 లక్షలు విలువగల డ్రగ్స్ ఉన్న 400కుపైగా స్టాంపులను జప్తు చేసినట్టు తెలిపారు.
ఒక్కో స్టాంపును ఈ ముఠా రూ.4వేలకు అమ్ముతోంది. పబ్‌లు, పార్టీలకు వీటిని సరఫరా చేస్తున్నట్టు నిందితులు అంగీకరించారు.
ఇదీ చూడండి:- గుండీల్లో హెరాయిన్ సప్లై- డ్రగ్ రాకెట్ గుట్టురట్టు