ETV Bharat / bharat

సరికొత్త పంథాలో డ్రగ్స్ స్మగ్లింగ్.. 110 మంది అరెస్ట్​

డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. తాజాగా కొరియర్​ పార్సిళ్ల రూపంలో డ్రగ్స్​ను సరఫరా చేస్తున్న ఘటనలు కేరళలో వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి అరెస్టులు చేస్తున్నారు.

DRUGS IN COURIER
కొరియర్​ పార్సిల్​లో డ్రగ్స్
author img

By

Published : Feb 5, 2022, 12:46 PM IST

దేశంలో డ్రగ్స్​ సరఫరాను అరికడదామని పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా...అది నెరవేరడం లేదు. విసృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా.. కొత్త విధానాలను అవలంబిస్తూ డ్రగ్స్​ స్మగ్లింగ్​​ చేస్తున్నారు. తాజాగా కొరియర్ ద్వారా డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని తెలిసి కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎక్కువగా యువతే...

గత కొద్ది రోజులుగా డాగ్​స్క్వాడ్​ సహాయంతో పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేరళ రాష్ట్రం కసర్​గడ్​ జిల్లాలో గత 20 రోజులుగా సుమారు వంద కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వాళ్లలో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 243.38 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్​ సీజ్​ చేసినట్లు వెల్లడించారు.

ARRESTED
అనుమానితుల అరెస్టు

సాధారణ ప్రజల్లా వచ్చి....

కొరియర్ పార్సిళ్లపైన చిరునామాలు సరిగ్గానే ఉన్నా... పేర్లు మాత్రం తప్పుగా ఇస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్ మాఫియా వాళ్లు సాధారణ ప్రజల్లా కొరియర్​ ఆఫీసులకు వచ్చి పార్సిళ్లు తీసుకుంటున్నారని, కొన్ని కొరియర్ ఏజెన్సీలు మాఫియాకు సహకరిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. ఎండీఎంఏ వంటి డ్రగ్స్​ బెంగుళూరు, మంగుళూరు నుంచి పార్సిళ్ల రూపంలో వస్తున్నాయని...చిన్న బృందాలుగా ఏర్పడి డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.