ETV Bharat / bharat

కన్నతల్లిపైనే కొడుకు అత్యాచారం.. గొంతుపై కత్తిపెట్టి... - అమ్మపై కొడుకు రేప్​

మద్యం, మాదకద్రవ్యాల మత్తులో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. తనకు సహకరించకపోతే గొంతు కోసేస్తానని బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. మానవజాతికి మచ్చ తెచ్చే ఈ ఘటన దీపావళి రోజు జరగ్గా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Druggist youth rapes mother at knife-point Police
కన్నతల్లిపైనే కొడుకు అత్యాచారం
author img

By

Published : Nov 7, 2021, 5:06 AM IST

మాదకద్రవ్యాలకు, ఆల్కహాల్​కు బానిసైన ఓ మానవమృగం.. తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపావళి పండగ రోజు సంబరాలు చేసుకోవాల్సిన ఇంట్లోనే తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. గొంతుపై బ్లేడు పెట్టి చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు రాక్షసుడు. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఈ ఘటన జరిగింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కిరాతకానికి పాల్పడిన యువకుడి శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

గాజియాబాద్​లోని తిల్లా మోర్ మురికివాడలో బాధితురాలు నివసిస్తున్నారు. గురువారం రాత్రి యువకుడు తప్పతాగి ఇంటికి వచ్చాడు. మద్యంతో పాటు మాదకద్రవ్యాలు సైతం సేవించాడు. వచ్చీ రాగానే తల్లి వద్దకు వెళ్లాడు. కొడుకు నడవడిక తేడాగా ఉందని గ్రహించిన తల్లి.. అతడితో వారించింది. దీంతో పదునైన కత్తిని తల్లి మెడపై పెట్టి అరవకుండా నోరుమూయించాడు. తనకు లొంగకపోతే గొంతు కోసేస్తానని బెదిరించారు. దీంతో నిస్సహాయులైన మహిళ.. ఆ మానవమృగం చేసిన అకృత్యాన్ని మౌనంగా భరించారు.

ఈ వేదనను అనుభవించిన మహిళ.. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లింది. కొడుకుపై ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అసలు ఊహించలేదు..

ఇలాంటి ఘటన ఎదురవుతుందని తన కలలో కూడా ఊహించలేదని ఆ తల్లి వాపోయారు. తన భర్త కూడా మాదకద్రవ్యాలకు బానిసై.. కుటుంబానికి భారంగా మారాడని చెప్పారు. చెడు కంపెనీలో పనిచేసి.. తన కొడుకు కూడా పాడైపోయాడని తెలిపారు. తానే కూలీ పని చేసి ఇంటిని నడిపిస్తున్నట్లు తెలిపారు.

చాక్లెట్​ ఆశచూపి..

చాక్లెట్​ ఆశచూపి ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మావో జిల్లాలో జరిగింది. బాలిక.. తన సోదరుడితో కలిసి మేకలు కాస్తుండగా.. చాక్లెట్​ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ యువకుడు(22) శుక్రవారం సాయంత్రం పక్కనున్న చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలిక అరుపులు విన్న సోదరుడు.. తల్లిదండ్రులకు చెప్పేందుకు ఇంటికి పరిగెత్తాడు. తీరా వాళ్లు వచ్చేసరికి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శుక్రవారం రాత్రే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: పాక్​ గెలిచినందుకు భార్య ఖుష్​.. పోలీసులకు భర్త ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.