ETV Bharat / bharat

పొట్టలో 44 డ్రగ్​ క్యాప్సుల్స్​, కడుపునొప్పితో ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా చిక్కి - బంగాల్​ లేటెస్ట్ న్యూస్

Drug Capsules Smuggling అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయుడిని పట్టుకున్నారు కోల్​కతా మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు. నిందితుడి కడుపులో నుంచి 44 డ్రగ్స్ మాత్రలను వెలికితీశారు. ఒక్కో మాత్ర బరువు సుమారు 14 గ్రాములు ఉంటుందని చెప్పారు. మొత్తం సుమారు అరకిలో కొకైన్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

drug smuggling news
drug smuggling news
author img

By

Published : Aug 27, 2022, 12:48 PM IST

Drug Capsules Smuggling: బంగాల్​ కోల్​కతాలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయుడిని పట్టుకున్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు. బ్రెజిల్​ నుంచి కోల్​కతాకు వచ్చిన నిందితుడి కడుపులో నుంచి 44 డ్రగ్స్ మాత్రలను వెలికితీశారు. ఒక్కో మాత్ర బరువు సుమారు 14 గ్రాములు ఉంటుందని చెప్పారు. మొత్తం సుమారు అరకిలో కొకైన్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రెజిల్​కు చెందిన 31 ఏళ్ల పాల్ సీజర్​ కడుపులో డ్రగ్స్ మాత్రలు వేసుకుని కోల్​కతాకు వచ్చాడు. విమానాశ్రయానికి చేరుకోగానే నిందితుడికి కడుపు నొప్పి మొదలైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం స్కానింగ్ చేయగా.. అసలు విషయం బయటపడింది.

drugs smuggling
కడుపులో నుంచి వెలికితీసిన డ్రగ్స్​
drugs smuggling
డ్రగ్స్​
drugs smuggling
స్కానింగ్​లో బయటపడిన డ్రగ్స్​

దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడే స్వయంగా డ్రగ్స్​ను మింగి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో సహకారం అందించిన వైద్యులకు మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్​ ఎక్కడ నుంచి తీసుకువచ్చాడనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

drugs smuggling
సేకరించిన డ్రగ్స్​
drugs smuggling
డ్రగ్స్​, నిందితుడు

ఇవీ చదవండి: పరికరం అమర్చి ఏటీఎంల్లో వరుస చోరీలు, చివరకు చిక్కాడిలా

2వేలకుపైగా తులసి మొక్కలతో భాజపా లోగో, వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.