ETV Bharat / bharat

డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

జమ్ముకశ్మీర్​లో వరుస డ్రోన్ల దాడులతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలపై ఓవైపు ఆర్డీఎక్స్​ పేలుడు పదార్థం వాడారా? అన్న కోణంలో విచారణ జరుగుతుండగా.. మరోవైపు నిర్బంధ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో లష్కరే తొయిబా టాప్ కమాండర్​ను కశ్మీర్​ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రత బలగాలు.

Drones attack
డ్రోన్ల దాడి
author img

By

Published : Jun 29, 2021, 4:33 AM IST

జమ్ము వైమానిక స్థావరంపై దాడి ఘటన తర్వాత అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అయితే ఆ దాడిలో ఆర్డీఎక్స్​ పేలుడు పదార్థాలు వాడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు విచారణాధికారులు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు.

ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిరసన

జమ్ము వైమానిక స్థావరంపై దాడి, పుల్వామాలో పోలీసు అధికార కుటుంబాన్ని హతమార్చిన ఘటనకు నిరసనగా శివసేన డోగ్రా ఫ్రంట్​ కార్యకర్తలు సోమవారం ఆందోళన నిర్వహించారు. రాణి పార్క్​ వద్ద డోగ్రా ఫ్రంట్​ కార్యకర్తలు.. పాకిస్థాన్​ జెండాను కాల్చి.. ఉగ్రవాదులు, పాకిస్థాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

డ్రోన్ల దాడులతో అప్రమత్తమైన అధికారులు నిఘా పెంచి.. నిర్బంధ తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్​లోని మల్​హురా పరిమ్​పోరా ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలిపిన అధికారులు.. ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు పేర్కొన్నారు.

లష్కరే కీలక ఉగ్రవాది అరెస్ట్​

లష్కరే తొయిబా అగ్రశ్రేణి కమాండర్​ నదీమ్​ అబ్రార్​ను సోమవారం జమ్ముకశ్మీర్​ పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీర్​లో సైన్యం, పౌరులపై జరిగిన పలు దాడుల్లో అబ్రార్​ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఎక్కడ, ఎప్పుడు అరెస్ట్ చేశారన్న విషయాన్ని వెల్లడించలేదు. అబ్రార్ నుంచి ఓ పిస్టల్​, గ్రనేడ్​ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది లవాయిపొరాలో ముగ్గురు సీఆర్​పీఎఫ్​ జవాన్ల హత్యలోనూ నిందితుడని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం​- సైన్యం అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.