ETV Bharat / bharat

ఐఫోన్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. 3600ఫోన్లు సీజ్ - డిపార్ట్​మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)

ముంబై విమానాశ్రయంలో ఐఫోన్ స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం ఛేదించింది. వీటి విలువ దాదాపు రూ.15కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగొట్టేందుకు 'మెమరీ చిప్స్' పేరిట వీటిని దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు.

iPhone smuggling
ఐఫోన్ స్మగ్లింగ్
author img

By

Published : Nov 29, 2021, 6:14 AM IST

దేశంలోకి అక్రమంగా ఐఫోన్లను తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ కార్గో కాంప్లెక్స్‌లో నిర్వహించిన సోదాల్లో మొత్తం 3,646 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంబంధిత దిగుమతి పత్రాలలో మాత్రం వీటిని.. 'మెమరీ కార్డ్‌లు'గా పేర్కొన్నట్లు గుర్తించారు. హాంకాంగ్‌ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

iPhone smuggling Racket
పట్టుబడిన ఐఫోన్లు

దాదాపు రూ.15 కోట్ల విలువ..

పట్టుబడిన వాటిల్లో మొత్తం 2,245 ఐఫోన్-13 ప్రో, 1,401 ఐఫోన్-13 ప్రో మ్యాక్స్ సహా.. 12 గూగుల్ పిక్సెల్ ప్రో6 ఫోన్​లు, ఓ యాపిల్ స్మార్ట్ వాచ్ ఉన్నాయని తెలిపారు. వీటి విలువ మొత్తం రూ.42.86 కోట్లుగా ఉంటే.. దిగుమతి చేస్తున్న వస్తువుల విలువను కేవలం రూ.80 లక్షలుగా చూపించడం గమనార్హం.

iPhone smuggling Racket
పట్టుబడిన ఐఫోన్లు

ఐఫోన్-13 వంటి హై-ఎండ్ ఫోన్ల కోసం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు ఎంతగా విస్తరించాయో ఈ ఉదంతం తెలుపుతోందని ఓ అధికారి తెలిపారు. 'పన్నులను ఎగ్గొట్టేందుకే ఈ తరహా దిగుమతి మోసానికి తెరలేపారు. ప్రస్తుత ఆపరేషన్​ ద్వారా భవిష్యత్​లో ఇటువంటి మోసాలను బలంగా అడ్డుకోగలం' అని వివరించారు.

iPhone smuggling Racket
పట్టుబడిన గూగుల్ పిక్సెల్ ఫోన్లు

భారతదేశంలోకి మొబైల్ ఫోన్‌లను దిగుమతి చేసుకుంటే దాదాపు 44% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్-13 సిరీస్‌ ఇటీవలే భారత్​లో విడుదలైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.