ETV Bharat / bharat

'యాంటీ ట్యాంక్​ గైడెడ్​​ మిసైల్​' ప్రయోగం విజయవంతం - క్షిపణి ప్రయోగం

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన.. యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా ప్రయోగించింది డీఆర్​డీఓ. దీన్ని ఆత్మనిర్భర భారత్​లో కీలక ముందడుగుగా పేర్కొంది. మరోవైపు.. ఒడిశాలోని ఇంటిగ్రెటెడ్​ టెస్ట్​​ రేంజ్​ నుంచి అధునాత ఆకాశ్​ మిసైల్​ను ప్రయోగించింది.

Man-Portable Anti-Tank Guided Missile
'యాంటీ ట్యాంక్​ గైడెడ్​​ మిసైల్​' ప్రయోగం విజయవంతం
author img

By

Published : Jul 21, 2021, 6:36 PM IST

ఆత్మనిర్భర భారత్​కు ఊతమిచ్చేలా, దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ బరువుతో రూపొందించిన యాంటీ ట్యాంక్​ గైడెట్​ మిసైల్​(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా పరీక్షించింది. థర్మల్​ సైట్​తో అనుసంధానమైన పోర్టబుల్​ లాంచర్​ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది డీఆర్​డీఓ. డైరెక్ట్​ అటాక్​ మోడ్​లో లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపింది.

  • #WATCH | Defence Research & Development Organisation (DRDO) successfully flight tested indigenously developed low weight, fire & forget Man-Portable Anti-Tank Guided Missile (MPATGM) today pic.twitter.com/Rqujm2N8MO

    — ANI (@ANI) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా.. కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీనిని ఎక్కడికైనా మోసుకెళ్లేలా రూపొందించారు.

కొత్త తరం ఆకాశ్​ మిసైల్​..

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం ఆకాశ్​ మిసైల్​ (ఆకాస్​-ఎన్​జీ)ను విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ. ఒడిశా తీరం ప్రాంతంలోని ఇంటిగ్రెటెడ్​ టెస్ట్​​ రేంజ్​ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఈ అధునాత క్షిపణి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

Man-Portable Anti-Tank Guided Missile
కొత్త తరం ఆకాశ్​ మిసైల్

ఇదీ చూడండి: 6 జలాంతర్గాముల కోసం భారత నేవీ రూ. 50వేల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.