DRDO Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీఓ 102 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్టోర్స్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
DRDO Recruitment 2023 Notification :
- స్టోర్స్ ఆఫీసర్- 17 పోస్టులు
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 20 పోస్టులు
- ప్రైవేట్ సెక్రటరీ- 65 పోస్టులు
విద్యార్హతలు
DRDO Jobs 2023 Eligibility :
అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న ఇతర అర్హతలను కూడా కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
DRDO Jobs 2023 Age Limit :
2024 జనవరి 12 నాటికి అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు.
పని అనుభవం తప్పనిసరి
DRDO Job Work Experience
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్స్ వ్యవహారాల్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
- స్టోర్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఈ కింది సంస్థల్లో ఏదైనా ఒక దాంట్లో స్టోర్స్ కీపింగ్ ఇంకా స్టోర్ అకౌంట్స్ నిర్వహణలో మూడు సంవత్సరాలు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వం
- రాష్ట్ర ప్రభుత్వం
- ప్రైవేట్ రంగంలోని స్వయంప్రతిపత్తి బ్యాంకులు
- ప్రభుత్వ రంగ బ్యాంకులు
- విశ్వవిద్యాలయాలు
- ఏదైనా ఒక గుర్తింపు పొందిన బ్యాంకు (భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయి ఉండాలి)
ఎంపిక ప్రక్రియ
DRDO Jobs 2023 Selection Process: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
అప్లై చేయండిలా(Steps To Apply For DRDO Jobs 2023)
- ముందుగా డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ www.drdo.gov.in లోకి లాగిన్ అవ్వండి.
- హోంపేజీలోని కెరీర్ సెక్షన్లో కనిపించే 'Filling up of various posts in DRDO, Ministry of Defense on Deputation basis'పై క్లిక్ చేయండి.
- మీరు ఏ పోస్టుకైతే దరఖాస్తు చేయలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి.
- అనంతరం అప్లికేషన్ ఫారం ప్రింట్అవుట్ను తీసుకోండి.
- ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నింపండి. అలాగే కావాల్సిన ధ్రువపత్రాలన్నింటినీ దానికి జత చేయండి.
- అప్లికేషన్ ఫారాన్ని నింపిన తర్వాత దానిని స్పీడ్ పోస్ట్ ద్వారా కింద తెలిపిన చిరునామాకు పోస్ట్ చేయండి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీరు నింపిన దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
DRDO Jobs 2023 Application Address : ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా Deputy Director, Dte of Personnel (Pers-AAl), Room No. 266, 2nd Floor, DRDO Bhawan, New Delhi-11010 చిరునామాకు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ
DRDO Jobs 2023 Apply Last Date : 2024 జనవరి 12లోపు అప్లికేషన్ ఫారాన్ని పంపించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్
DRDO Official Website : నోటిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని వివరాల కోసం డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ www.drdo.gov.in ను చూడవచ్చు.
రైల్వేలో 3,015 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు లాస్ట్‌డేట్ ఎప్పుడంటే!
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 గవర్నమెంట్ జాబ్స్ - అప్లై చేసుకోండిలా!