ETV Bharat / bharat

Covid: స్వరూపం మారితే.. పిల్లలపై ప్రభావం!

చిన్నారుల్లో ప్రభావం చూపేంతగా కరోనా వైరస్​లో మార్పులు రాలేదని కేంద్రం స్పష్టంచేసింది. వైరస్​లో ఒకవేళ మార్పులు వచ్చినా.. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

corona in children
చిన్నారుల్లో కరోనా
author img

By

Published : Jun 1, 2021, 10:16 PM IST

Updated : Jun 2, 2021, 1:11 PM IST

దేశంలో కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకు పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే, వైరస్‌ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపింది.

'చిన్నారుల్లో వైరస్‌ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టాము. సాధారణంగా పిల్లలకు వైరస్‌ సోకితే లక్షణాలు కనిపించవు. ఇన్‌ఫెక్షన్‌ సోకినా లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అసలే కనిపించవు. ఇప్పటివరకు పిల్లల్లో వైరస్‌ సంక్రమణ తీవ్రత ప్రమాదకరంగా ఏమీ లేదు' అని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. అయితే, ఒక్కోసారి వైరస్‌ స్వభావంలో మార్పులు సంభవిస్తే.. పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ తక్కువగానే ఉంటుందని.. కేవలం 2 నుంచి 3శాతం చిన్నారులకు మాత్రమే ఆసుపత్రిలో చేరిక అవసరం ఏర్పడవచ్చని అంచనా వేశారు. అందుకే అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత అవుతున్నామని.. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని వీకే పాల్‌ స్పష్టం చేశారు.

రెండు విధాలుగా గుర్తింపు..

పలు రాష్ట్రాల్లో చిన్నారుల్లో వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని వస్తోన్న నివేదికలపై కేంద్ర ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టతనిచ్చారు. చిన్నారుల్లో కరోనా వైరస్‌ ప్రభావాన్ని రెండు విధాలుగా గుర్తించవచ్చని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వివరించారు. కొందరిలో నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇక వైరస్‌ నుంచి కోలుకున్న చిన్నారుల్లో కొందరిలో రెండు, మూడు వారాల తర్వాత మల్టీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను గుర్తించామన్నారు. ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పటికీ ప్రమాద తీవ్రత తక్కువేనని తెలిపారు. ఇలాంటి సమయంలో చిన్నారులు వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే, కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా లక్షా 27వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 51రోజుల్లో రోజువారీ కేసుల్లో ఇదే అత్యల్పం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2కోట్ల 81లక్షల మందిలో వైరస్‌ బయటపడగా.. ఇప్పటివరకు మొత్తం 3లక్షల 31వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి?

Last Updated : Jun 2, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.