ETV Bharat / bharat

బాడ్​మేర్​ ఎన్​కౌంటర్​పై తీవ్ర దుమారం

రాజస్థాన్​ బాడ్​మేర్​ పోలీసులు ఇటీవల జరిపిన ఎన్​కౌంటర్​ వివాదాస్పదంగా మారింది. నిందితుడి ఇంటిని చుట్టుముట్టి ఎన్​కౌంటర్​ చేయడమేంటని విమర్శలు వస్తున్నాయి. ఎన్​కౌంటర్​కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

live encounter
ఎన్​కౌంటర్, లైవ్​ ఎన్​కౌంటర్
author img

By

Published : Apr 26, 2021, 12:05 PM IST

రాజస్థాన్​ బాడ్​మేర్​ పోలీసులు ఇటీవల చేసిన ఎన్​కౌంటర్​ వివాదాస్పదమైంది. యాక్సిడెంట్​ చేసి పరారైన కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే.. ఈ ఎన్​కౌంటర్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్​గా మారిన పోలీసుల ఎన్​కౌంటర్​

ఇదీ జరిగింది..

ఏప్రిల్​ 22న రాత్రి 9-10 గంటల మధ్య బాడ్​మేర్ పోలీసులు.. కమలేశ్ ప్రజాపతి అనే వ్యక్తిని ఎన్​కౌంటర్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు మృతి చెందాడు. తమను తాము రక్షించుకునేందుకే ఈ ఎన్​కౌంటర్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో పోలీసులు కమలేశ్ ప్రజాపతి ఇంటిని చుట్టుముట్టినట్లు వైరల్​ అయిన వీడియోలో స్పష్టంగా కనిసిస్తోంది.

"పోలీసులు తన ఇంటి వద్దకు చేరుకున్నాక కమలేశ్​ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్​పై వాహనం ఎక్కించబోయాడు. ఈ కారణంగానే ఎన్​కౌంటర్​ జరిపారు. వీడియో చూసిన వారు అది ప్రజాపతి ఇళ్లు అని ఎలా భావిస్తున్నారు. అది ఆయన ఫ్యాక్టరీ కూడా అయి ఉండొచ్చు కదా?" అని బార్​మేడ్ ఎస్పీ ఆనంద్ శర్మ అన్నారు. ఈ నేపథ్యంలో.. ఇది పోలీసుల కుట్ర అని కొందరు విమర్శలు గుప్పించారు.

పాలీ జిల్లాలో జరిగిన హిట్​ అండ్​ రన్​ కేసులో ప్రజాపతి నిందితుడిగా ఉన్నాడని సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.