ETV Bharat / bharat

'నా భర్తకు ఓటేయొద్దు.. అతని క్యారెక్టర్ మంచిది కాదు'

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ .. కలియాగంజ్ భాజపా అభ్యర్థి సౌమిన్ రాయ్​పై ఆయన భార్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఓటేయొద్దని, అతని క్యారెక్టర్​ మంచిది కాదని మీడియా ముందు తెలిపారు. ఆమెకు మద్దతుగా రాయ్ కుమార్తె సైతం వచ్చారు.

kaliagunj bjp candidate
సౌమిన్​ రాయ్​ వివరాలను చూపుతున్న భార్య శర్బరీ
author img

By

Published : Apr 18, 2021, 5:46 PM IST

బంగాల్ ఎన్నికల నేపథ్యంలో.. కలియాగంజ్ భాజపా అభ్యర్థి సౌమిన్ రాయ్​ భార్య శర్బరీ సింఘా రాయ్​ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన భర్త సౌమిన్​ రాయ్​ క్యారెక్టర్ మంచిది కాదని, అతనికి ఓటేయొద్దని మీడియా సమక్షంలో కలియాగంజ్ ప్రజలను కోరారు శర్బరీ. తన భర్త గురించి నిజాలను బయటపెట్టేందుకు మీడియా ముందుకొచ్చినట్లు తెలిపారు.

kaliagunj assembly constitution
సౌమిన్​ రాయ్​ గురించి మాట్లాడుతున్న అతని భార్య శర్బరీ
Don't vote for my husband
కుమార్తెతో కలిసి మీడియా ముందుకు శర్బరీ

"యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి చాలా డబ్బు దోచుకున్నాడు సౌమిన్. నన్ను, నా కూతుర్ని మోసం చేసి వేరే కాపురం పెట్టాడు. దయచేసి అతనికి ఓటేయొద్దు. ప్రజా ప్రతినిధి అయ్యే అర్హత అతనికి లేదు."

-శర్బరీ సింఘా రాయ్​, సౌమిన్ రాయ్​ భార్య

కలియాగంజ్​ అభ్యర్థిగా సౌమిన్​ను తొలగించాలని తాను.. రాష్ట్ర, కేంద్ర భాజపా నాయకులను కోరినట్లు శర్బరీ పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఏ పార్టీకీ తాను మద్దతుగా మాట్లాడటం లేదని.. సౌమిన్​కు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

kaliaganj assembly constituency
సౌమిన్​ రాయ్ అక్రమ సంబంధం చిత్రం
kaliagunj assembly
సౌమిన్ రాయ్ అక్రమ ఆస్తుల వివరాలు
sowmin roy wedding card
సౌమిన్​ రాయ్ మరో పెళ్లి చేసుకున్నారన్న శర్బరీ
sowmin roy with his wife
రెండో భార్యతో సౌమిన్​ రాయ్​

కలియాగంజ్​ భాజపా అభ్యర్థిగా సౌమిన్​ రాయ్​ పేరును ప్రకటించినప్పటి నుంచి.. నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. సౌమిన్​ రాయ్​ను తొలగించాలని స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష సైతం చేపట్టారు.

బంగాల్​ ఎన్నికల వేళ గతంలోనూ ఇలాంటి ఘటనలు వార్తల్లోకి వచ్చాయి. భాజపా అభ్యర్థి సౌమిత్రా ఖాన్​, అతని భార్య సుజాతా మోండల్​, శోవోన్​ ఛటర్జీ, అతని భార్య రత్నా ఛటర్జీల వివాదాలు వార్తల్లో నిలిచాయి.

ఇదీ చదవండి : 'దిల్లీలో 30 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు'

ఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు- 1500 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.