ETV Bharat / bharat

దుష్ప్రచారాలు నమ్మొద్దు: రైతులకు తోమర్​ లేఖ - అసత్య ప్రచారాలను నమ్మొద్దు: రైతులకు తోమర్​ బహిరంగ లేఖ

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులకు బహిరంగ లేఖ రాశారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. సాగు చట్టాలపై విపక్షాలు సృష్టిస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అందులో పేర్కొన్నారు. కేంద్రం ఎల్లప్పుడూ రైతు సంక్షేమం కోసమే పాటుపడుతుందని ఆయన వివరించారు.

Agri minister has made effort to engage in humble dialogue, do read his letter: PM to farmers
అసత్య ప్రచారాలను నమ్మొద్దు: రైతులకు తోమర్​ బహిరంగ లేఖ
author img

By

Published : Dec 17, 2020, 11:42 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ.. రైతులకు బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఈ చట్టాలపై కాంగ్రెస్​, విపక్షాలు చేస్తున్న బూటకపు మాటలను పట్టించుకోవద్దని సూచించారు. అన్నదాతల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తన ఎనిమిది పేజీల లేఖలో స్పష్టం చేశారు.

  • Union Agriculture Minister Narendra Singh Tomar writes an open letter to farmers over the new farm laws. He writes, "Misunderstanding has been created among some farmers' unions regarding these laws". pic.twitter.com/KiNsW043Rz

    — ANI (@ANI) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: సాగు చట్టాల అమలు ఆపాలన్న సుప్రీం- నో చెప్పిన కేంద్రం

రైతు సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న తోమర్​.. చిన్న, మధ్యస్థాయి రైతులకు ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో కొత్త చట్టాలను తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కొనసాగించడం సహా.. ప్రస్తుతం ఉన్న మండీ వ్యవస్థను బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్నదాతల భూములను కార్పొరేట్​ సంస్థలు నియంత్రించేందుకు ఈ చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవని ఈ సందర్భంగా తోమర్​ చెప్పారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్​ ప్రకాశ్​, 40 మంది రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు అనేక రైతు సంఘాలు మద్దతు ప్రకటించగా.. కొన్ని యూనియన్లు మాత్రం గందరగోళాన్ని సృష్టించాయని లేఖలో రాసుకొచ్చారు తోమర్​. అయితే.. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలు పన్నిన కుట్రను బహిర్గతం చేయడం సహా.. వాస్తవాలను బయటకు తీయడం తమ కర్తవ్యమని లేఖలో పేర్కొన్నారు.

లేఖ చదవండి: మోదీ

వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ రాసిన లేఖను చదవాలని అన్నదాతలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన రాసిన ఈ వినయపూర్వకమైన లేఖను రైతులు చదివి అర్థం చేసుకోవాలంటూ ట్వీట్​ చేశారు.

  • कृषि मंत्री @nstomar जी ने किसान भाई-बहनों को पत्र लिखकर अपनी भावनाएं प्रकट की हैं, एक विनम्र संवाद करने का प्रयास किया है। सभी अन्नदाताओं से मेरा आग्रह है कि वे इसे जरूर पढ़ें। देशवासियों से भी आग्रह है कि वे इसे ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं। https://t.co/9B4d5pyUF1

    — Narendra Modi (@narendramodi) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సోదర సోదరీమణులకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన భావాలను వినయపూర్వకంగా వ్యక్తపరిచారు. కాబట్టి ఈ లేఖను ప్రతి రైతూ చదవాలని నేను కోరుతున్నాను. వీలైనంత ఎక్కవ మందికి ఈ సందేశాన్ని చేరవేయాలని అభ్యర్థిస్తున్నాను."

-ప్రధాని మోదీ ట్వీట్​

ఆగని ఆందోళనలు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో కొద్దిరోజులుగా వేలాది మంది రైతులు నిరసన బాట పట్టారు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు ఐదు దఫాల చర్చలు జరిగాయి. రైతు సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. అయితే.. రైతు యూనియన్లు ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

ఇదీ చదవండి: నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్​కు​ రాహుల్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.