ఆవు, గేదె పాలకు డిమాండ్ బాగా ఉంటుందని మనకు తెలుసు. కానీ, మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో మాత్రం గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. అయితే.. ధర తక్కువగా ఉన్నందువల్లే ఇంత డిమాండ్ ఉందని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ గాడిద పాల ధర లీటరుకు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారంటే నమ్మశక్యంగా అనిపించదు.


ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబీకులు దాదాపు 20 గాడిదలతో పాల వ్యాపారం చేస్తున్నారు. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ పాలకు భారీగా డిమాండ్ ఉందని లక్ష్మీబాయి ధోత్రే తెలిపారు. ప్రస్తుతం 10 మిల్లీలీటర్ల పాలు రూ. 100కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు ఈ పాలు ఎంతో బలాన్నిస్తాయని ధోత్రే వివరించారు.
గాడిద పాలు తాగితే విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుందని, చర్మం మృదువుగా తయారవుతుందని చాలా మంది నమ్ముతుంటారు.
ఇదీ చదవండి:మీ పేరు అదేనా? అయితే పెట్రోల్ ఫ్రీ!