ఉత్తర్ప్రదేశ్, కాన్పూర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. నవజాత శిశువు శవాన్ని ఓ వీధికుక్క నోటకరుచుకుని జనావాసాల్లోకి తీసుకువచ్చింది. జిల్లాలోని భద్రస్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
గ్రామం చుట్టూ తిరుగుతూ ఓ వీధి కుక్క చాలాసేపు అరిచింది. అనంతరం పాలీథిన్తో చుట్టి ఉన్న ఓ శిశువు శవాన్ని గ్రామంలోకి తీసుకువచ్చింది. రాకేశ్ శుక్లా అనే వ్యక్తి ఇంటి ముందు ఆ మాంసపు ముద్దను వదిలివెళ్లింది. దానిని గ్రామస్థులు ఫొటోలు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ శిశువు ఎవరికి చేందినదనే సమాచారం ఇంకా తెలియలేదని చెప్పారు.
ఇదీ చదవండి:Rape: లిఫ్ట్ ఇచ్చి.. యువతిపై అత్యాచారం