ETV Bharat / bharat

కుక్కను ఉరేసి చంపిన మందుబాబులు.. తమను చూసి అలా చేసిందని.. - చూసి మొరిగిందని ఉరివేసిన మద్య ప్రియులు

మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు మందుబాబులు. తమ క్రూరత్వాన్ని శునకంపై చూపించారు. తమను చూసి కుక్క అరిచిందని ఉరివేసి హత్య చేశారు. ఈ అమానుష ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

drunkers killed dog
కుక్క దారుణ హత్య
author img

By

Published : Dec 22, 2022, 9:42 AM IST

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో మద్యం మత్తులో కొందరు దుండగులు దారుణంగా ప్రవర్తించారు. తమను చూసి కుక్క అరిచిందని ఉరివేసి హత్య చేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది..
రాయ్​పుర్​లోని అమ్లీదీహ్​ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే సమయంలో వారిని చూసి కుక్క గట్టిగా అరిచింది. దీంతో కోపం పెంచుకున్న వారు దారుణానికి ఒడిగట్టారు. కుక్క కాళ్లు, చేతులు కట్టేసి ఉరితీశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పీపుల్​ ఫర్​ యానిమల్ అనే సంస్ధ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుక్కను హత్య చేసిన ప్రదేశాన్ని ఆ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డిమాండ్​ చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్ బరేలి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయి రెండు కుక్కపిల్లలను గాయపరిచారు. కుక్క చెవులను కత్తిరించి మందుతో కలిపి సేవించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
అంతకుముందు కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కకు విషం కలిపిన మాంసం ముక్కలు పెట్టి హత్య చేశారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.