Dog hanged to death: మూగజీవాల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు కొందరు దుండగులు. ఓ కుక్క పిల్లను, తల్లిని చెట్టుకు ఉరివేసి దారుణంగా చంపేశారు. మహారాష్ట్ర, ఠాణెలోని ఉల్హాస్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుక్కలను ఉరివేసి చంపేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది: మార్చి 16న కొందరు దుండగులు ఉల్హాస్‌నగర్‌లోని క్యాంప్ 5 సాయినాథ్ కాలనీ ప్రాంతంలో ఓ చెట్టుకు రెండు శునకాలను ఉరి తీశారు. ఆ మరుసటి రోజున సమాచారం తెలుసుకున్న జంతుప్రేమికుడు శ్రిష్టిచుగ్.. సంఘటనా స్థలానికి చేరుకోగా.. కుక్క పిల్ల, తల్లి చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. స్థానికులను ఆరా తీశారు శ్రిష్టిచుగ్. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శునకాల కళేబరాలను పోస్టుమార్టానికి తరలించారు.
మార్చి 17న హిల్లైన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదై ఎనిమిది రోజులు గడుస్తున్నా దీనికి కారకులు ఎవరనేది తెలియలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు సీనియర్ ఇన్స్పెక్టర్ లక్షణ్ సరిపుత్ర.
నోట్లో నాటుబాంబు పేలి ఏనుగు మృతి: తినే పదార్థం అనుకుని ఓ అటవీ ఏనుగు నాటు బాంబును కొరకగా నోట్లోనే పేలింది. గాయాలతో తిరుగుతున్న ఏనుగును మార్చి 20న తమిళనాడు, కోయంబత్తూర్ నగర సమీపంలో గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ గజరాజు గురువారం మృతి చెందినట్లు చెప్పారు. దాని వయసు సుమారు 10 ఏళ్లుగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: మహిళపై దారుణం.. వివస్త్రను చేసి.. కర్రలతో కొట్టి..