ETV Bharat / bharat

కుక్క కరిచిందని గన్​తో కాల్చి చంపిన తండ్రీకొడుకులు.. 75 ఏళ్ల తల్లిపై రేప్​! - 75 ఏళ్ల తల్లిపై రేప్​

కుక్క కరిచిందని.. తుపాకీతో కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అందుకు తన కుమారుడి సహాయం కూడా తీసుకున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులను తండ్రీకొడుకులను అరెస్ట్​ చేశారు. మరోవైపు, 75 ఏళ్ల కన్నతల్లిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్​లో జరిగింది.

dog-bites-man-kills-dog-by-firing-licensed-gun-in-haryana-son-raped-75-year-old-mother-in-punjab

author img

By

Published : Apr 19, 2023, 9:30 AM IST

Updated : Apr 19, 2023, 9:48 AM IST

కుక్క కరిచిందని గన్​తో కాల్చి చంపిన తండ్రీకొడుకులు

హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్​పై వెళ్తుండగా తనను కరిచిందని.. కుక్కను గన్​తో కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. కుమారుడిని వెంటబెట్టుకుని ఆ కుక్కను వెతికి మరీ కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తండ్రీకొడుకులను అరెస్ట్​ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
జిల్లాలోని సలార్​పుర్​ గ్రామానికి చెందిన సతీశ్​ అనే వ్యక్తి.. తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తున్నప్పుడు అతడిని ఓ కుక్క కరిచింది. ఆ తర్వాత అతడు.. బైక్​పైనే తన ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత సతీశ్​.. తన కుమారుడిని తీసుకుని మళ్లీ కుక్క కరిచిన ప్రాంతానికి వచ్చాడు. తనను కరిచిన కుక్క కోసం అక్కడ అంతా వెతికాడు. చివరకు ఓ ఇంటి సమీపంలో ఆ శునకాన్ని గుర్తించాడు.

వెంటనే తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు సతీశ్​. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు.. అక్కడి నుంచి బైక్​పై వెళ్లిపోయారు. ఈ దృశ్యాలంతా.. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీశ్​తో పాటు అతడి కుమారుడిని అరెస్ట్​ చేశారు. పోలీస్​స్టేషన్​కు తరలించారు.

75 ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం..
పంజాబ్​లోని ఫజిల్కా జిల్లాలో దారుణం జరిగింది. డ్రగ్స్​కు బానిసైన ఓ యువకుడు.. కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని బల్లువానా ప్రాంతానికి చెందిన బాధితురాలు(75).. తన ఇంట్లో నిద్రపోతోంది. మిగతా కుటుంబ సభ్యులంతా.. స్థానికంగా జరుగుతున్న ఓ వివాహ వేడుకకు వెళ్లారు. మాదకద్రవ్యాలకు బానిసైన ఆమె కుమారుడు(32).. రాత్రి రెండు గంటల సమయంలో మద్యం ఫూటుగా తాగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భోజనం చేశాడు.

మద్యం మత్తులో ఒంటరిగా నిద్రపోతున్న తన తల్లిపై దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లి అని చూడకుండా అత్యాచారం చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చి వృద్ధురాలి రెండో కుమారుడు.. ఆమెను కాపాడాడు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వృద్ధురాలి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడు అవివాహితుడని, డ్రగ్స్‌కు బానిసయ్యాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

Last Updated : Apr 19, 2023, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.