పెంపుడు కుక్కను నిర్లక్ష్యంగా వదిలేసి బాలుడి గాయానికి కారణమైన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది.
![Dog bites boy: owner arrested on charges of neglegence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-slm-02-dogbite-vis-pic-7204525_29112020125026_2911f_1606634426_646_2911newsroom_1606638301_114.jpg)
ఏం జరిగింది?
తమిళనాడు సేలం జిల్లా కన్నన్‌కురిచి నగరానికి సమీపంలో ఉన్న చెరన్‌లోని ఓ దుకాణానికి బాలుడు విఘ్నేశన్, అతని చెల్లితో కలిసి వెళ్లాడు. బాలికను కరిచేందుకు కుక్క రాగా తరిమేసేందుకు అతడు ప్రయత్నించాడు. అది బాలుడిని గాయపరిచింది. స్థానికులు శునకాన్ని అక్కడి నుంచి తరిమేశారు.
బాలుడి తల్లితండ్రులు పెంపుడు శునకం గురించి ఆరాతీసి స్థానికుడైన ప్రభాకరన్ పెంచుకున్నట్లు తెలుసుకున్నారు. కుక్క తమ కుమారుడిని కరిచిందని వారు ప్రభాకరన్‌కు చెప్పగా అతడు సరిగా స్పందించలేదు. దీంతో కన్నన్‌కురిచి పోలీస్ స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలిచి విచారించినప్పటికీ ప్రభాకరన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్ల అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: బెంగళూరులో కొత్త రకం కప్ప