ETV Bharat / bharat

'ఆవుపేడ థెరపీ'తో కరోనా తగ్గుతుందా?

author img

By

Published : May 11, 2021, 4:18 PM IST

గుజరాత్‌లో కొంత మంది ఆవు పేడ, మూత్రాన్ని ఒంటినిండా పూసుకొంటున్నారు. బాగా ఆరిన తర్వాత పాలు లేదా మజ్జిగతో కడుక్కుంటున్నారు. ఇలా వారానికి కనీసం ఒక రోజైనా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా రాకుండా కాపాడుకోవచ్చని వారు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

cow dung, cow dung theraphy
ఆవుపేడ థెరపీ

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలా మంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఈ మహామ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటివరకు ఔషధాలేవీ రాలేదు. కొన్ని రకాల వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

గుజరాత్‌లో కొంత మంది ఆవు పేడ, మూత్రాన్ని ఒంటినిండా పూసుకొంటున్నారు. బాగా ఆరిన తర్వాత పాలు లేదా మజ్జిగతో కడుక్కుంటున్నారు. ఇలా వారానికి కనీసం ఒక రోజైనా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా రాకుండా కాపాడుకోవచ్చని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఫార్మాసిస్టులు కూడా ఉండటం గమనార్హం.

మంచిది కాదు..

అయితే, ఈ విధంగా ఆవు మలమూత్రాలను పూసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆవు హిందువులకు పవిత్రమైన జంతువు. ఆరోగ్యానికి, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇది అనాదిగా వస్తున్నదే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అనవసరపు నమ్మకాలకు పోయి కష్టాల పాలవ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

'ఆవుపేడ థెరపీ కోసం కొంత మంది డాక్టర్లు కూడా వెళ్తుంటారు. ఈ థెరపీ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని వారి నమ్మకం. ఆ నమ్మకంతోనే నిర్భయంగా కొవిడ్‌ రోగులకు వైద్యం చేయడానికి వెళ్లగలుగుతున్నారు' అని గుజరాత్‌లోని ఓ ఔషధ ఉత్పత్తి సంస్థ అసోసియేట్‌ మేనేజర్‌ గౌతమ్‌ మనీలా అంటున్నారు. కొవిడ్‌ తొలిదశ వ్యాప్తి సమయంలో తాను కూడా ఆవుపేడ థెరపీతోనే కొవిడ్‌ను జయించానని చెబుతున్నారు.

అయితే కేవలం ఇది నమ్మకం మాత్రమేనని, కొవిడ్‌ నివారణకు ఎలాంటి నాటువైద్యాల జోలికి పోవద్దని, దానివల్ల వేరే వ్యాధులు ప్రభలే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ఆవు మలమూత్రాలను ఒంటికి పోసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగే మాట పక్కన పెడితే.. ఆ జంతువులకు ఉండే ఆరోగ్య సమస్యలు మనుషులకు కూడా వ్యాపించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.