చనిపోయిన వ్యక్తి మెదడులో కృత్రిమ ద్రావణం ప్రసరణ చేసి కర్ణాటక వైద్యులు అరుదైన ఘనత సాధించారు. భగల్కోట్లోని ఎస్ నిజలింగప్ప వైద్య కళాశాలలోని శాస్త్రవేత్తలు మానవ మెదడుపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి మెదడులో ఉండాల్సిన సెరిబ్రోస్పైనల్ ద్రావణం లేదు. దాంతో కృత్రిమ ద్రావణ ప్రసరణ చేయించి తమ పరిశోధన కొనసాగించారు.
ఇలా మెదడులోకి కృత్రిమ ద్రావణం సరఫరా చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రపంచంలో రెండోసారి అని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ సంజీవ కోలగి తెలిపారు.
మానవ మెదడులోని లోపలి, బయటి పొరల మధ్య ఈ సెరిబ్రోస్పైనల్ ద్రావణం ఉంటుంది. మెదడులోని పొరలకు..వెన్నముకలోని పొరల మధ్య సరఫరా అవుతూ మన మెదడును రక్షిస్తూ ఉంటుంది. ఈ సెరిబ్రోస్పైనల్ ద్రావణం సాయంతోనే మెదడు శాస్త్రచికిత్సలు చేస్తారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 16,752 మందికి కరోనా