ETV Bharat / bharat

మహిళకు అరుదైన శస్త్రచికిత్స.. 3.5 కిలోల కణితి తొలగించిన వైద్యులు - పంజాబ్ అమృత్​సర్ లేటెస్ట్​ న్యూస్​

పంజాబ్​ వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్​ చేశారు. ఓ మహిళ పొట్టలోనుంచి 3.5 కిలోల కణితిని తొలగించారు. ఎన్నో ఆస్పత్రిలు తిరిగి అక్కడకు చేరుకున్న ఆమెకు.. ఆ వైద్యులు పునర్జన్మ అందించారు.

doctors removed a 3 kgs tumor
అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు
author img

By

Published : Dec 4, 2022, 6:26 PM IST

పంజాబ్​లోని వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి.. ఓ మహిళ కడుపులో నుంచి దాదాపు 3.5 కిలోల బరువున్న కణితిని తొలగించారు. ఎంతో ఖర్చుతో కూడుకునే ఆ శస్త్రచికిత్సను తక్కువ ధరకే చేసి ఆమెకు పునర్జన్మ అందించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స శుక్రవారం జరిగినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.

అమృత్​సర్​లోని బల్జీందర్​ సింగ్​ భార్య.. కుల్బీర్​ కౌర్​ గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయగా.. కడుపులో ఓ పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చాలా ఆస్పత్రిలకు వెళ్లగా అక్కడ డాక్టర్​లు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో వారు నాగ్​కలాన్​లోని బాబా ఫరీద్ ఛారిటబుల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ రాజ్‌బీర్ సింగ్ బజ్వా అతితక్కువ ఖర్చుతోనే ఆమెకు ఆపరేషన్​ చేశారు. నాలుగు గంటలపాటు శ్రమించిన వైద్యులు.. దాదాపు 3.5 కిలోలా బరువున్న కణితిని ఆ మహిళ కడుపు నుంచి తొలగించి పునర్జన్మ అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.