మధ్య ప్రదేశ్ భోపాల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. ఆదివారం ఆమె పొత్తి కడుపులోని 16కేజీల కణితిని, సుమారు 6 గంటల పాటు శ్రమించి తొలగించారు.
సకాలంలో కణితిని తొలగించకపోతే మహిళ ప్రాణాలకు ముప్పుగా మారేదని పేర్కొన్నారు వైద్యులు. ప్రస్తుతం అమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.