తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్, పార్టీ జనరల్ సెక్రటరీ దురైమురుగన్, టీ ఆర్ బాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ నెహ్రూ గవర్నర్‌ను కలిశారు. డీఎంకే శాసనసభాపక్ష నేతగా స్టాలిన్‌ను ఎన్నుకున్నట్లు గవర్నర్‌కు లేఖ అందించారు.
మే 7 తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శాసనసభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 133 మంది స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమితో కలిసి మొత్తంగా 159 స్థానాల్లో విజయఢంగా మోగించింది.
ఇదీ చదవండి:శాసనసభాపక్షనేతగా స్టాలిన్- 7న సీఎంగా ప్రమాణం