ETV Bharat / bharat

అమ్మా క్యాంటీన్​పై డీఎంకే కార్యకర్తల దాడి

చెన్నైలోని అమ్మా క్యాంటీన్​పై పలువురు డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన పార్టీ చీఫ్ స్టాలిన్​.. అందుకు కారకులైన వారిని పార్టీ నుంచి తొలగించారు. ఘటనపై నొలంబూర్​ పోలీస్​ స్టేషన్​లో డీఎంకే ఫిర్యాదు చేసింది.

DMK men vandalize Amma Canteen, డీఎంకే కార్యకర్తల దాడి
అమ్మా క్యాంటీన్​పై డీఎంకే కార్యకర్తల దాడి
author img

By

Published : May 5, 2021, 1:17 PM IST

చెన్నైలోని మధురవోయల్​ ప్రాంతంలో ఉన్న అమ్మా క్యాంటీన్​ను పలువురు డీఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ఈ క్యాంటీన్​పై దాడులు చేయడం వివాదానికి దారితీసింది. క్యాంటీన్​ పరిసరాల్లోని పోస్టర్లను, బోర్డులను ఓ కార్యకర్త ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. దీనిపై స్పందించిన డీఎంకే చీఫ్ స్టాలిన్.. ఘటనకు కారకులైన వారిని పార్టీ నుంచి తొలగించారు.

DMK men vandalize Amma Canteen, డీఎంకే కార్యకర్తల దాడి
అమ్మా క్యాంటీన్​పై డీఎంకే కార్యకర్తల దాడి
DMK men vandalize Amma Canteen, డీఎంకే కార్యకర్తల దాడి
అమ్మా క్యాంటీన్​

అమ్మా క్యాంటీన్​ ఎదుట చింపివేసిన పోస్టర్​

స్థానిక ఎమ్మెల్యే ఎంఏ సుబ్రమణియన్​ ఘటనాస్థలానికి చేరుకుని ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను చక్కదిద్దే చర్యలు చేపట్టారు. పార్టీ అధినేత స్టాలిన్ ఇద్దరు కార్యకర్తలపై వేటు వేశారని వెల్లడించారు. ఘటనపై డీఎంకే నొలంబూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి : బంగాల్​ ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.