ETV Bharat / bharat

అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!

తమిళనాడులో ఎన్నికల్లో పోటీ మొత్తం ఎప్పటిలాగే ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే నడుస్తోంది. అయితే 2019లో ఎన్​డీఏతో జట్టుకట్టిన విజయకాంత్ పార్టీ-డీఎండీకే పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. ఇటు అన్నాడీఎంకేలో ప్రాధాన్యం లేక, డీఎంకేతో కలవలేక ఒంటరిగా మిగిలిపోయే స్థితికి చేరింది.

DMDK left in lurch by AIADMK?
పట్టించుకోని అన్నాడీఎంకే.. ఏకాకిగా విజయకాంత్
author img

By

Published : Feb 16, 2021, 5:12 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అక్కడి పొత్తులపై పూర్తి స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా విజయకాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్​పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర సీఎం, అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి డిసెంబర్​లోనే ప్రచార పర్వానికి శంఖారావం పూరించినా... డీఎండీకేతో పొత్తు విషయం ఇప్పటికీ చర్చకు రాలేదు. కానీ, ఇతర పార్టీల విషయంలో పళనిస్వామి చురుగ్గానే అడుగులు వేస్తున్నారు. కూటమి భాగస్వామి అయిన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) వ్యవస్థాపకుడు డా. ఎస్ రాందాస్​ను కలిసేందుకు మంత్రులను పురమాయిస్తున్నారు. పీఎంకే గిల్లిగజ్జాలకు దిగుతున్నా.. ఆ పార్టీని తమతో కలుపుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది లోక్​సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీతో కలిసే పోటీ చేసింది అన్నాడీఎంకే. అప్పుడు పీఎంకే అధినేత రాందాస్ ఓటమి చవిచూశారు. అయినా.. విశ్వాసం కోల్పోకుండా అతడిని రాజ్యసభకు పంపించింది అన్నాడీఎంకే.

విమర్శించినా.. వారి కోసమే!

సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులను బహిరంగంగా విమర్శిస్తున్నారు పీఎంకే యువజన విభాగం నేతలు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 'వన్నియార్ల'కు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్​లో హింసాత్మక ఘటనలకు సైతం పాల్పడ్డారు. వందలూర్, తాంబరం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైలుపై రాళ్లు విసిరారు. చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధించారు. అయితే వీటన్నింటినీ తేలికగానే తీసుకుంటోంది అన్నాడీఎంకే. ఇప్పటికీ ఆ పార్టీని తమతో కలుపుకోవాలనే భావిస్తోంది. హింసకు పాల్పడ్డ కార్యకర్తలపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇదీ చదవండి: చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

మరోవైపు, అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్న డీఎండీకేకు మాత్రం ఎదురుచూపులే శరణ్యం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. చర్చల విషయం మాత్రం ఇప్పటికీ ప్రస్తావనకు రావడం లేదు. అన్నాడీఎంకే నేతలు డీఎండీకేను పట్టించుకోకుండా ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు.

కూటములు మార్చి మార్చి..

2005లో ఈ పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించారు. అయితే వృద్ధాచలం అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్నింట్లోనూ అభ్యర్థులు ఓడిపోయారు. గెలిచిన ఒక్క సీటూ విజయకాంత్​దే. అయితే రాష్ట్రవ్యాప్తంగా డీఎండీకే 8 శాతం ఓట్లు దక్కించుకుంది. 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లను డీఎండీకే అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

DMDK left in lurch by AIADMK?
విజయకాంత్

ఇదీ చదవండి: చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు?

తర్వాత విజయకాంత్ సహా ఆయన పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని 41 స్థానాల్లో పోటీ చేయగా.. 29 నియోజకవర్గాల్లో గెలుపొందింది. డీఎంకే కన్నా అధిక స్థానాలు గెలుచుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సంపాదించింది. అనంతరం అప్పటి సీఎం జయలలితతో విబేధాల కారణంగా అన్నాడీఎంకేకు విజయకాంత్ దూరమయ్యారు. పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రతిపక్ష స్థానాన్నీ కోల్పోయారు.

2016 ఎన్నికల్లో వామపక్షాల సరసన చేరారు విజయకాంత్. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే(విదుతలై చిరుతైగల్ కట్చి), ఎండీఎంకే(మరుమలార్చి ద్రవిడ మున్నెట్ర కళగం), సీపీఎం, సీపీఐ, డీఎండీకే కలిసి పీపుల్స్ వెల్​ఫేర్ ఫ్రంట్​(పీడబ్ల్యూఎఫ్)గా పోటీ చేశాయి. కానీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏతో కలిసి పోటీ చేసిన డీఎండీకే... 2.1 శాతం ఓట్లకు పరిమితమైంది.

అన్నాడీఎంకేతో ఉంటే 9 సీట్లే!

డీఎండీకేకు అధికార పక్షం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ కార్యకర్తలు నిట్టూర్చుతున్నారు. క్షేత్రస్థాయి కమిటీ సమావేశాల్లోనూ పార్టీ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2006 మాదిరిగానే ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని చెబుతున్నారు.

ఒకవేళ డీఎండీకే అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమితోనే ఉంటే ఆ పార్టీకి 9 లేదా అంతకన్నా తక్కువ సీట్లే కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టే అన్నాడీఎంకే నుంచి విజయకాంత్ దూరంగా వెళ్తున్నారని పలువురు చెబుతున్నారు.

"ఎక్కువ సీట్లు కేటాయించాలని అధికార పార్టీపై డీఎండీకే ఒత్తిడి పెంచుతోంది. పీఎంకే పార్టీ వైపే మొగ్గుచూపుతున్న అన్నాడీఎంకే మాత్రం.. డీఎండీకేకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు."

-రవీంద్రన్ దురైస్వామి, రాజకీయ విశ్లేషకులు

మరోవైపు, డీఎండీకేతో కలిసేందుకు డీఎంకే కూడా సిద్ధంగా లేదు. ఆ పార్టీకి డీఎంకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. 2016లో పీడబ్ల్యూఎఫ్​తో కలిసి పోటీ చేసినప్పటి నుంచి డీఎండీకేను ప్రత్యర్థిగానే చూస్తోంది.

ఒంటరి పోరే దిక్కు!

2016 అసెంబ్లీ ఎన్నికలు డీఎండీకే పార్టీకి అత్యంత ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. దీన్నుంచి కోలుకొని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాణించడం కష్టమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ప్రతిసారి కూటములు మార్చడం కూడా పార్టీకి చేటు చేసింది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే గత్యంతరమే ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'మా తమ్ముడు సీఎం కావడం అసాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.