ETV Bharat / bharat

119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో డీజే, ఉత్సాహంగా డ్యాన్సులు - DJ In Man Funeral Procession

119 ఏళ్ల వృద్ధుడి అంతిమ యాత్రలో డీజే ఏర్పాటు చేశారు ఆయన కుటుంబసభ్యులు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు​ చేస్తూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే

Grandchildren play DJ in mans funeral procession in Habra

author img

By

Published : Aug 22, 2022, 7:37 PM IST

119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో డీజే

DJ In Man Funeral Procession: సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంతిమయాత్ర నిర్వహిస్తుంటారు. మృతదేహానికి సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుపుతారు. కానీ మీరెప్పుడైనా డీజే పాటలు, డ్యాన్సు​ల మధ్య అంతిమయాత్ర నిర్వహించడం చూశారా? బంగాల్​.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఓ 119 వృద్ధుడు మరణిస్తే ఆయన కుటుంబసభ్యులు అలానే చేశారు. డీజే పాటలకు బంధువులంతా డ్యాన్స్​ చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు.

డ్యాన్సులు చేస్తున్న గ్రామస్థులు, బంధువులు

జిల్లాలోని కుమ్రా గ్రామానికి చెందిన డెబెన్​ హజ్రా(119) అనారోగ్యంతో మరణించారు. ఆయన 1903లో జన్మించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. చుట్టుపక్క గ్రామాల్లో ఎక్కడైనా నాటకాలు జరిగితే తప్పకుండా చూడటానికి వెళ్లేవారు. ఇంట్లో కూడా ఎక్కువ సమయం పాటలు పాడుతూ ఆనందంగా గడిపేవారు. శనివారం.. డెబెన్​ మరణవార్త విన్న బంధువులంతా ఆయన ఇంటికి చేరుకున్నారు. అందరూ కలిపి డెబెన్​ అంత్యక్రియల్లో డీజే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత​ అంతిమయాత్రలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీజే పాటలకు అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Grandchildren play DJ in mans funeral procession in Habra
మృతుడు డెబెన్​

మృతుడి ఇద్దరు తమ్ముళ్లు కూడా కొద్ది రోజుల క్రితమే చనిపోయారు. డెబెన్​కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తోడబుట్టినవారి సంతానాన్ని కలిపితే.. ఆయనకు 150 మందికి పైగా మనువళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే డెబెన్​ మాత్రం రోజూ కుటుంబసభ్యులతో నవ్వుతూ, నవ్విస్తూ, పాటలు పాడుతూ ఎక్కువ సమయం గడిపేవారు.

ఇవీ చదవండి: మద్యం మత్తులో స్నేహితుల అరాచకం, మలద్వారంలో గ్లాసు చొప్పించి

రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.