Diwali 2023 Quotes and Wishes in Telugu: "చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి".. అంటూ పాడుకునేందుకు దేశం మొత్తం సిద్ధమైంది. ఈ పండగ రోజున.. ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. ప్రతి ఇంటా.. లక్ష్మీపూజ సుగంధాలు వెదజల్లుతాయి. ఊరూరా బాణసంచా మోతలు మోతెక్కిపోతాయి. ఇలాంటి పండగ సందడి వేళ.. మీ ప్రియమైన వారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలపండి. ఇందుకోసమే "ఈటీవీ భారత్" స్పెషల్ కోట్స్, విషెస్ అందిస్తోంది.
దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!
Diwali 2023 Wishes in Telugu :
- ఈ దీపావళి పండగ మీ జీవితాల్ని కాంతిమయం చేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
- ఈ పండుగ మీ జీవితంలో వెలుగులు నింపి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని కోరుకుంటూ.. మీకు దీపావళి శుభాకాంక్షలు.
- చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటూ.. మీకు దీపావళి శుభాకాంక్షలు.
- లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట కొలువుండగా.. సంతోషం పాలై పొంగగా.. దీపకాంతులు వెలుగునివ్వగా.. ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు.
- దీపావళి వెలుగులు.. మీ ఇంట ఆనందపు కాంతులను విరజిమ్మాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపి మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు
- దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు
- దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి.. మీ జీవితంలో వెలుగు పూలు వికసించాలని కోరుకుంటూ.. దివాళీ శుభాకాంక్షలు
- అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే ఈ దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు
- లక్ష్మీ దేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై కురిసి, మీ జీవితంలో ఎప్పుడూ సుఖశాంతులు నిండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
రంగు రంగుల దివ్వెలు, రకరకాలు ప్రమిదలు - దీపాల పండుగ వేళ మార్కెట్లో కళ
Diwali 2023 Quotes in Telugu:
- "చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి."
- దుష్టశక్తులను పారదోలి.. కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ"
- "నరకాసురుని వధించి.. నరులందరి జీవితాలలో వెలుగును నింపిన మాతా సత్యభామ శౌర్యానికి.. చెడుపై మంచి విజయానికి.. ప్రతీక ఈ దీపావళి"
- "కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్టే.. దీపావళి పండుగ మీ కష్టాలను తరిమేయాలి"
- "కష్టాల చీకట్లు తొలగిపోవాలి.. సంతోషాల వెలుగులు ప్రసరించాలి"
- "ఓ చిట్టి దీపం ఆవిరవుతూ అందరికీ వెలుగు ఇస్తుంది. ఆ ప్రేరణతోనే అందరం ముందుకు సాగుదాం."
- "దీపాలు వెలిగిద్దాం.. ప్రకృతికి ఎక్కువ హాని చెయ్యకుండా పండుగ చేసుకుందాం."
- "ఒక్కొక్క దీపం వెలిగిస్తూ.. చీకటిని తరిమేసినట్లు.. ఒక్కొక్క మార్పూ చేసుకుంటూ.. బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం"