ETV Bharat / bharat

రాజకీయాల కోసం కేసులా?: పోలీసులపై సుప్రీం అసహనం - ఐపీఎస్‌ అధికారి గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌

అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాయడం ఇబ్బందికరమైన సంప్రదాయంగా మారిందని సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పోలీసులపై చర్యలు తీసుకోవడం వంటి సంప్రదాయానికి తెర పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సుప్రీం కోర్టు
supreme court on polce
author img

By

Published : Aug 26, 2021, 2:26 PM IST

Updated : Aug 26, 2021, 5:42 PM IST

పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.

సస్పెండైన ఐపీఎస్‌ అధికారి గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌పై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం(Chhattisgarh government) దేశద్రోహం, తదితర కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ(Chief Justice N V Ramana) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యత వహించాలని.. వారి తీరు ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని ఆక్షేపించింది.

"పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టే ధోరణి. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉంది. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదవుతున్నాయి. అధికారం మారగానే కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ప్రాప్తం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధిస్తున్నారు."

-సుప్రీంకోర్టు.

రాయ్‌పూర్‌ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌పై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మొదట అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆయన ఇళ్లలో ఏసీబీ, ఇతర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయి. తర్వాత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ గుర్జిందర్ పాల్‌పై దేశద్రోహం కేసు కూడా పెట్టారు. అనంతరం, పోలీసు శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేశారు.

తనపై దాఖలైన కేసులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పరిణామం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గుర్జిందర్‌ను నాలుగు వారాలపాటు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసు విచారణకు సహరించాలని ఐపీఎస్ అధికారికి సూచించింది. ఈ కేసులపై నాలుగు వారాల్లో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు

ఇదీ చూడండి: 'పెగసస్​పై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం!'

Last Updated : Aug 26, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.