తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా చేపట్టిన బలగాల ఉపసంహరణ ప్రక్రియ.. తుది దశకు చేరిందని తెలుస్తోంది. భారత రక్షణ విభాగానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం.
వాగ్వాదం..
బడ్జెట్లో రక్షణశాఖలో ఏ విభాగానికి ఎంత నిధులు కేటాయించాలో పరిశీలించేందుకు గురువారం.. స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. త్రిదళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు పలువులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీకి.. భాజపా నాయకుడు జువెల్ ఓరమ్ అధ్యక్షత వహించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సభ్యుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి జువెల్ ఓరమ్ మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్.. సరిహద్దు వివాదంపై పలు ప్రశ్నలను సంధించేందుకు యత్నించారు. దీన్ని జువెల్ ఖండించారు. సమావేశం అజెండా అది కాదన్నారు.
కొన్ని నెలల ప్రతిష్టంభన అనంతరం సరిహద్దులో ఇటీవలే బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టాయి భారత్-చైనా. దీనిపై పార్లమెంట్ వేదికగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రసంగించారు.
ఇదీ చదవండి : 'జమ్ముకశ్మీర్‌కు ఇప్పటికీ ఉగ్రముప్పు'