ETV Bharat / bharat

'దయచేసి నాకు భార్యను వెతికిపెట్టండి'.. కలెక్టర్​ను అభ్యర్థించిన దివ్యాంగుడు - ఒడిశా అనుగుల్ జిల్లా న్యూస్

తాను పెళ్లి చేసుకోవడానికి ఓ యువతిని వెతికిపెట్టమని కలెక్టర్​ను అభ్యర్థించాడు ఓ దివ్యాంగుడు. ఈ మేరకు కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందించాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఒడిశాలో సోమవారం జరిగింది.

Disabled Person Requests Collector to Find a Life Partner

author img

By

Published : Aug 8, 2023, 4:37 PM IST

కలెక్టర్ ఆఫీసులో సమస్యలను తీర్చండని అభ్యర్థనలు చేయడం చూస్తుంటాం. లిఖిత రూపంలో ఫిర్యాదు చేయడం సాధారణమే. అయితే ఒడిశా.. అనుగుల్ జిల్లా కలెక్టరేట్​లో మాత్రం సోమవారం ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ దివ్యాంగుడు తాను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలని కలెక్టర్​ వద్ద అభ్యర్థించాడు. ఈ అభ్యర్థనతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
అనుగుల్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు సోమవారం నువాపాడ గ్రామానికి చెందిన సంజీబ్ మహాపాత్ర అనే ఓ దివ్యాంగుడు వెళ్లాడు. తాను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలని కలెక్టర్​కు వినతిపత్రం అందించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను జిల్లా యంత్రాంగం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 'ప్రభుత్వం నేను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలి. నేను, నా కుటుంబం ఎంత ప్రయత్నించినా నాకు పెళ్లి కుదరలేదు. నేను దివ్యాంగుడిని. నా తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. నా సోదరుడు వేరే కాపురం ఉంటున్నాడు. నేను సరిగ్గా నడవలేను. నా తల్లిదండ్రులు, నన్ను చూసుకోవడం కోసం ఓ తోడు అవసరం. అందుకే వివాహం చేసుకుందామనుకుంటున్నా. అలాగే ట్రైసైకిల్​ను నాకు ప్రభుత్వం ఇప్పించాలి' అని సంజీబ్ మహాపాత్ర కోరాడు.

Disabled Person Requests Collector to Find a Life Partner
కలెక్టర్ ఆఫీసులో సంజీబ్ మహాపాత్ర

సంజీబ్ మహాపాత్ర కలెక్టర్​కు ఇచ్చిన వినతిపత్రం

లవర్​ కోసం డిప్యూటీ సీఎంకు లేఖ..
ఓ నిరుద్యోగ యువతి బిహార్​ ఉపముఖ్యమంత్రికి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది. ఎఫైర్​ పెట్టుకోవాల్సిన టైంలో కరెంట్​ ఎఫైర్స్​ చదువుతున్నానని.. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి నా మనసులోని మాటను చెప్పలేకపోతున్నానని అందులో పేర్కొంది. ఈ లేఖ బిహార్​వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పింకీ అనే యువతి పేరిట ఈ లేఖ వచ్చింది. చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువతి.. ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. నాలుగు సంవత్సరాలుగా తాను ప్రభాత్​ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అతడిని వన్​సైడ్​ లవ్​ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలకున్నట్లు ఆ యువతి తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ముక్కుతో దివ్యాంగుడి టైపింగ్​.. నిమిషానికి 36 పదాలతో రికార్డు.. ఇండియా బుక్​లో చోటు

పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.