Dinosaurs Egg found in MP: భూమి మీద అతిపెద్ద ప్రాణులుగా గుర్తింపు పొంది, చాలాకాలం కిందటే అంతరించిపోయిన డైనోసార్ల గుడ్లు శిలాజీకరణ రూపంలో ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బడవానీ అడవిలో 10 డైనోసార్ రాతి గుడ్లను కనుగొన్నారు.
పురాతత్వ శాస్త్రవేత్తల కథనం మేరకు.. ఇవి కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ గుడ్లు. సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం ఈ ఆసక్తికరమైన వార్తకు కేంద్రంగా మారింది. పురాతన శిల్పాలు, కోటలపై గత జనవరి 30న సర్వే ప్రారంభించిన పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ డి.పి.పాండే ఫిబ్రవరి 5వ తేదీన అటవీ సిబ్బందితో పాటు వర్ల తహసీల్‌లోని హింగ్వా గ్రామ సమీపం అడవికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న రాతి గుడ్లు పాండే కంటపడ్డాయి. వాటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగతావి 25 కేజీలు మేర ఉన్నాయి. వీటిని ఇందోర్ మ్యూజియంలో ఉంచనున్నారు.
ఇదీ చూడండి: 'ట్రీ హౌస్'లో ఆన్లైన్ క్లాసులు.. నెట్వర్క్ సమస్యలకు చెక్