ETV Bharat / bharat

ఐదేళ్ల బాలికపై 'డిజిటల్​ రేప్​'.. 15 ఏళ్ల బాలుడిపై కేసు

Digital Rape Case: ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​శహర్​ జిల్లాలో డిజిటల్​ రేప్​ కేసు నమోదైంది. ఓ ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు డిజిటల్​ రేప్​కు పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అసలు ఈ డిజిటల్​ రేప్​ అంటే ఏమిటి?

digital rape
డిజిటల్​ రేప్​
author img

By

Published : Jun 13, 2022, 8:18 PM IST

Digital Rape Case: ఐదేళ్ల బాలికపై డిజిటల్​ రేప్​కు పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​, బులంద్​శకర్​లోని ఖుర్జా దెహాత్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలి పొరుగింట్లో నిందితుడు ఉంటాడు. బాలిక ఇంట్లో ఒకడిగా మెదిలేవాడు. ఈ క్రమంలోనే చిన్నారికి ఆహారం తినిపిస్తానంటూ ఆమె ప్రైవేట్​ భాగాలను తాకటం వంటి వెకిలి చేష్టలకు పాల్పడడ్డాడు. ఇది గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

డిజిటల్​ రేప్​ అంటే ఏమిటి?: డిజిటల్​ అంటే ఇంటర్నెట్​తో ఏమైనా సంబంధం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే డిజిటల్​, రేప్​ రెండు వేర్వేరు పదాలు. డిజిట్​ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్​ రేప్​ అని పేరు పెట్టారు. డిజిటల్​ రేప్​ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం. విదేశాల్లో మాదిరిగానే డిజిటల్​ రేప్​పై భారత్​లోనూ ఓ చట్టం ఉంది.

ఇదీ చూడండి: మైనర్​పై 80ఏళ్ల వృద్ధుడి 'డిజిటల్​ రేప్​'- అసలేంటీ కొత్త కేసు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.