ETV Bharat / bharat

సర్కారీ బడిలో స్మార్ట్ అటెండెన్స్.. విద్యార్థి డుమ్మా కొడితే పేరెంట్స్​కు మెసేజ్! - kerela atal tinkering lab scheme

తొలిసారి ఓ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల హాజరు వివరాలు ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు మెసేజ్ రూపంలో అందడం దీని ప్రత్యేకత. ఈ వ్యవస్థను కేరళలోని సర్కారీ బడి విద్యార్థులే అభివృద్ధి చేయడం మరో విశేషం.

digital attendance machine
డిజిటల్ అటెండెన్స్ మెషీన్
author img

By

Published : Apr 22, 2022, 6:03 PM IST

Kerala school digital attendance system: కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అధునాతన హాజరు విధానం అమల్లోకి వచ్చింది. పాలక్కడ జిల్లా చిత్తూరులోని సర్కారీ బడి విద్యార్థులే ఈ స్మార్ట్​ అటెండెన్స్ సిస్టమ్​ను అభివృద్ధి చేయడం విశేషం. పిల్లలంతా బయోమెట్రిక్ యంత్రంలో రోజూ ఉదయం, సాయంత్రం వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ ఆటోమెటిక్​గా సర్వర్​లో నిక్షిప్తమవుతాయి. విద్యార్థులు బడికి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తిరిగెళ్లారు అనే సమాచారం తల్లిదండ్రుల మొబైల్​ ఫోన్స్​కు మెసేజ్ రూపంలో వెళ్తుంది.

విద్యార్థుల స్టార్టప్​: ప్రభుత్వ పాఠశాల కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్​ను అభివృద్ధి చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, గణితశాస్త్రం, ఇంజినీరింగ్ రంగాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 2018లో అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరిట ఈ అంకుర సంస్థ ఏర్పాటైంది. ఆసక్తి ఉన్న 5 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇందులో భాగస్వాములు.

రోజువారీ జీవితంలో ఉపయోగపడే రోబోలు సహా వేర్వేరు అంశాలపై ఈ పాఠశాల విద్యార్థులు ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్మార్ట్ హాజరు విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ ఆమోదిస్తే.. కేరళలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.