ETV Bharat / bharat

డీఐజీ భార్య పర్సు చోరీ.. బస్సులో ప్రయాణిస్తుండగా..

DIG wife Purse stolen: డీఐజీ స్థాయి అధికారి భార్య పర్సు చోరీకి గురైంది. బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె పర్సును గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

DIG WIFE PURSE
DIG WIFE PURSE stolen
author img

By

Published : Dec 25, 2021, 9:12 AM IST

DIG wife Purse stolen: మహారాష్ట్రలో డీఐజీ స్థాయి అధికారి భార్య పర్సునే కొట్టేశాడు ఓ ఆగంతుకుడు. డీఐజీ భార్య సిటీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీఐజీ భార్య(56) ముంబయిలోని మలబార్ హిల్స్​లో నివసిస్తున్నారు. చాకాల ప్రాంతం నుంచి అంధేరీ రైల్వే స్టేషన్​కు వెళ్లేందుకు.. బుధవారం మధ్యాహ్నం సమయంలో బృహన్​ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్​పోర్ట్(బెస్ట్) బస్సులో ఎక్కారు. బస్సులో టికెట్ కొనేందుకు బ్యాగ్ తీశారు. అందులో నుంచి డబ్బులు ఉన్న మరో పర్సును బయటకు తీశారు. అంతే, ఓ దొంగ కన్ను ఆమె పర్సుపై పడింది. ఆమెకు తెలియకుండానే ఆ పర్సు పోయింది.

బస్సు దిగిన తర్వాత చూసుకునేసరికి బ్యాగులో పర్సు లేదు. దీంతో పర్సు పోయిందని నిర్ధరించుకున్న ఆ మహిళ.. బస్సు డిపో వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడింది. పర్సు పోయిన విషయాన్ని వారికి వివరించింది. మహిళ ప్రయాణించిన బస్సు కండక్టర్​కు అధికారులు ఫోన్ చేశారు. పర్సు బస్సులో పడిపోయిందేమోనన్న అనుమానంతో ఆరా తీశారు. అయితే, బస్సులో ఎలాంటి పర్సు దొరకలేదని కండక్టర్​ బదులిచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు డీఐజీ భార్య. దీనిపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన మహిళలపై భాజపా కార్యకర్తల దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.