ETV Bharat / bharat

Police and Doctors on CBN Health చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం.. మెడికల్ రిపోర్టును కోర్టుకు నివేదిస్తాం! వైద్యులతో కలసి పోలీసుల మీడియా సమావేశం - చంద్రబాబుకు వైద్య పరీక్షలు

Police and Doctors on CBN Health చంద్రబాబు ఆరోగ్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆవరణలో ప్రభుత్వ వైద్యులు, పోలీసు అధికారుల మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రబాబు వైద్య నివేదికపై వివరాలనూ కోర్టుకు సమర్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబు అంశంను ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే... తప్పక పాటిస్తామని వారు పేర్కొన్నారు.

DIG Press conference at Rajahmundry Central Jail

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:50 PM IST

Updated : Oct 14, 2023, 10:26 PM IST

DIG Press conference at Rajahmundry Central Jail: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై... రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆవరణలో ప్రభుత్వ వైద్యులు, జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్​... మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని వైద్యులు సూచించించారు. ఆయనకు చల్లని వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు పేర్కొన్నారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో తమకు తెలియదని వైద్యులు తెలిపారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు వేసుకున్న మందులను మాకు చూపించారని.. వాడే మందులు చూశాకే మిగతా మందులు సూచించినట్లు వైద్యులు వెల్లడించారు.

జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవు: నిన్న వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు పంపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ్టి వైద్యుల నివేదికనూ కోర్టుకు వెంటనే పంపిస్తామని పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటామని డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నారని అందుకు తగినట్లు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత వైద్యుడి సలహాతో మందులు వాడతానని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని జైలు అధికారులు తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు చూస్తామని పేర్కొన్నారు. ములాఖత్‌ సమయం వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ములాఖత్‌ పూర్తయ్యిందని గుర్తుచేయడం తమ బాధ్యత అనీ... తాము ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించదని, పోలీసు వెల్లడించారు.

TDP Leader Somireddy Harsh Comments on CM Jagan: శిశుపాలుడివి వంద తప్పులైతే జగన్‌వి వెయ్యి తప్పులు : సోమిరెడ్డి

చంద్రబాబుతో ములాఖత్​లో కుటుంబ సభ్యుల ఆందోళన: రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర భావోద్వేగం చెందారు. ఆయన మానసికంగా ధైర్యంగా ఉన్నా...శారీరక సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. నేడు బలహీనంగా ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్యంపై అక్కడే ఉన్న జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ను లోకేశ్ ప్రశ్నించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన నారా లోకేశ్: అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని... నారా లోకేశ్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, రిమాండ్ లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భద్రత లేని జైలులో బాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణ హాని తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దోమలు ఎక్కువ ఉన్నాయన్నా పట్టించుకోలేదని... సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారని మండిపడ్డారు.

TDP Leaders Fire on YSRCP Leaders on CBN Health: చంద్రబాబు ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ నేతలు రాక్షసానందం ఏమిటీ..? టీడీపీ నేతల ఫైర్

DIG Press conference at Rajahmundry Central Jail: చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు

Last Updated : Oct 14, 2023, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.