ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల ఫిథోరాగఢ్ జిల్లా మున్స్యారీ హర్డియా నాలా వద్ద కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఓ నిండు గర్భిణీని(pregnant lady) ఆస్పత్రికి తరలించేందుకు 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. స్థానికుల సాయంతో ఆమెను స్ట్రెచర్‌పై మోసుకుంటూ కొండ దాటారు. అనంతరం అంబులెన్సు ఎక్కించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నేపాల్‌కు చెందిన ఈ మహిళ మన్స్యారీలో కార్మికురాలిగా పని చేస్తోంది. శుక్రవారం పురిటినొప్పులు రాగా.. 108కు ఫోన్ చేశారు కుటుంబ సభ్యులు. కొండచరియలు విరిగపడటం వల్ల వాహనం ఇంటివద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అయింది. స్థానికుల సాయంతో గర్భిణీని మోసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వర్షాలు కురిసినప్పుడల్లా తాము ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నామని మన్స్యారి గ్రామస్థులు తెలిపారు. ప్రతి వర్షకాలం హర్డియా నాలాలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు!