ఝార్ఖండ్ రాంచీలోని విద్యానగర్‌కు చెందిన తరుణ్.. దివ్యాంగుడైన తన 31 ఏళ్ల కుమారుడికి టీకా వేయించాలని నిశ్చయించుకున్నాడు. స్థానికంగా.. ఆదివారం వారాంతపు లాక్డౌన్ అమలులో ఉండటం వల్ల వారికి వాహనాలు కూడా అందుబాటు లేవు. ఏది ఏమైనా అర్జున్‌కు టీకా ఇప్పించాల్సిందే అని పట్టుదలతో ఉన్న ఆ తండ్రి.. అతడిని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి, తన భార్య అల్బాదేవితో కలిసి ఆసుపత్రికి నడక ప్రారంభించాడు. ఇలా 6 కిలోమీటర్లు అర్జున్ను వీల్‌ఛైర్‌పై తోస్తూ.. కాలినడకన అక్కడున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.
స్పందించని సిబ్బంది..
తరుణ్ దంపతులు తమ కుమారుడితో అంతదూరం నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు కానీ.. వారిని పట్టించుకున్న వారే లేరు. వ్యాక్సిన్ రెజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రద్దీగా ఉండటం వల్ల కొన్ని గంటల పాటు వారు ఆ ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు పడ్డారు. కుమారుడికి సాయంగా ఒకరు ఉండి.. వంతులు వారీగా క్యూలో నిల్చోసాగారు.
ఈటీవీ భారత్ చొరవ..
తరుణ్ స్థితిని గమనించిన ఈటీవీ భారత్.. ఆరా తీయగా తమ వివరాలను వెల్లడించాడు. దీంతో ఈటీవీ భారత్ చొరవ తీసుకుని అధికారులకు సమాచారం అందించింది. దీనిపై స్పందించిన అధికారులు.. అర్జున్‌కు వీలైంత త్వరగా వ్యాక్సిన్ అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. అర్జున్‌కు వ్యాక్సిన్ అందించిన సిబ్బంది.. వారు ఇంటికి చేరుకునేందుకు అంబులెన్సును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : చక్రాసనంలో 30 కేజీల బరువు మోసి రికార్డు