ETV Bharat / bharat

ధనత్రయోదశి రోజున ఈ పనులు చేస్తున్నారా? జర జాగ్రత్త!

Dhanteras 2023 Dos and Don'ts in Telugu : దివాళీకి ముందు వచ్చే ధంతేరాస్​కు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు కోసం చాలా మంది ఎప్పటినుంచో ఎదురుచూస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు.. ఎంతో కొంత బంగారం కొనాలని ఆరాటపడతారు. కానీ, ఇంతటి పవిత్రమైన రోజు చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 5:22 PM IST

Dhanteras 2023
Dhanteras

Dhanatrayodashi 2023 Dos and Don'ts in Telugu : దీపావళి వస్తుందంటే ఎక్కువగా వినిపించే పేరు ధన త్రయోదశి. దీనిని ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దివాళీ(Diwali 2023) ఐదు రోజుల వేడుకలు ధంతేరాస్​తో మొదలవుతాయి. అయితే ఈ ఏడాది ధంతేరాస్​ నవంబర్ 10వ(శుక్రవారం) తేదీన జరుపుకుంటున్నారు. ఈ త్రయోదశి పర్వదినం శుక్రవారం మధ్యాహ్నం 12:35 గంటల నుంచి ప్రారంభమై.. మరుసటి రోజు అంటే 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:57 గంటలకు పూర్తవుతుంది.ఈ రోజున సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవిని, ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని, కుబేరుడిని పూజిస్తారు.

Dhanteras 2023 : అలాగే ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తారు. వెండి సహా వంట సామాగ్రి కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా ధనలాభం చేకూరుతుందని, ఇంటిల్లిపాది సుఖశాంతులతో ఉంటారని ప్రజలు నమ్ముతారు. అందుకే ధన త్రయోదశి(Dhanteras 2023) రోజు నాడు ఓ చిన్న వస్తువునైనా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ధంతేరాస్ రోజు చేయాల్సిన పనులు..

ఇంటిని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి : ధన త్రయోదశి నాడు ముందుగా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మాలు, కిటికీలను అందమైన తోరణాలు, పూలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోనికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం..

దీపాలు వెలిగించాలి : ఈ పర్వదినాన సాయంత్రం ఇంటి ముందు, ఇంటి చుట్టూ నూనె దీపాలు వెలిగించాలి. అలాగే ధూపం స్టిక్స్ కూడా వెలిగించవచ్చు. ఈ దీపాలు చీకటిని పోగొట్టి, దుష్టశక్తులను పారద్రోలుతాయని విశ్వసిస్తారు.

లక్ష్మీ పూజ : ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల అనంతరం మీ కుటుంబంతో కలిసి తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ దేవికి ఇష్టమైన స్వీట్లు, పండ్లు, పువ్వులు, నైవేద్యాలను సమర్పించాలి. లక్ష్మీ దేవి మంత్రాలను పఠిస్తూ.. సంపద, శ్రేయస్సు కోసం ఆమెను పూజించాలి. అదే విధంగా గోమాతను పూజించి.. చపాతీ, బెల్లం వంటి వాటిని ఆహారంగా అందించాలి.

ధన్వంతరి మంత్రాన్ని జపించాలి : ఈ రోజున ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని కూడా పూజించాలి. అలాగే ధన్వంతరి మంత్రాన్ని జపించాలి. ధన్వంతరిని పూజించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం.

షాపింగ్ చేయాలి : ధంతేరాస్​.. ముఖ్యంగా బంగారం, వెండి పాత్రలను కొనుగోలు చేయడంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అలాగే చాలా మంది ఈ రోజు కొత్త చీపుర్లను కొనుగోలు చేసి, ఇంటికి తీసుకువస్తారు. చీపురును లక్ష్మీదేవికి మరో రూపంగా భావిస్తారు.

పేద వారికి ఏదైనా సహాయం చేయాలి : ఈ రోజు దానం చేయడం ఉత్తమం. స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం, పేదవారికి సహాయం చెయ్యడం లాంటివి చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?

ధన త్రయోదశి రోజు చేయకూడని పనులివే..

వాదనలు, ప్రతికూలతలను నివారించండి : ధంతేరాస్ రోజు మీ ఇంట్లో సానుకూల, సామరస్య వాతావరణం ఉండేలా చూడటం చాలా ముఖ్యం. వాదనలు పెట్టకోవద్దు.

ఇనుము లేదా ఉక్కు వస్తువులను కొనుగోలు చేయవద్దు : ఈ రోజున ఇనుము లేదా ఉక్కు వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది. అలాగే కత్తెరలు, కత్తులు లాంటి పదునైనవి కొనవద్దు. ఎందుకంటే ఈ రోజున వీటిని కొనడం అశుభకరంగా భావిస్తారు.

అప్పులు తీసుకోవడం మానుకోండి : ధంతేరాస్‌ రోజున అప్పులు తీసుకోవడం మంచిది కాదంటారు. ఎందుకంటే ఈ రోజున అప్పు తీసుకుంటే.. అది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని నమ్ముతారు.

మాంసం, ఆల్కహాల్​కు దూరంగా ఉండండి : ఈ రోజు మాంసాహారం తినకుండా ఉండటం శ్రేయస్కరం. అలాగే ఆల్కహాల్ తాగడం, జూదం ఆడడం లాంటివి చేయకూడదు. అదే విధంగా ఈ పర్వదినాన గుడ్లు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటి వాటిని ఆహారంలో చేర్చకుండా సాత్వికాహారం తీసుకోవాలి. ఇక చివరగా నలుపు రంగును దూరంగా ఉంచాలి.

దీపావళి స్పెషల్​ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.