ETV Bharat / bharat

కుంభమేళా భక్తులపై హెలికాప్టర్​తో పూలవర్షం! - kumbha mela in uttarakhand

మహాశివరాత్రి సందర్భంగా కుంభమేళాకు వచ్చిన యాత్రికులపై పూలవర్షం కురిపించాలని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్​ సింగ్ రావత్​.. అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

uttarakhand cm
'కుంభమేళాలో పూలవర్షం కురిపించాలి'
author img

By

Published : Mar 11, 2021, 5:35 AM IST

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరథ్ సింగ్​ రావత్​ కుంభమేళాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కుంభమేళా యాత్రికులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సీనియర్​ అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

"రాష్ట్రాభివృద్ధి కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులది ఇందులో కీలక పాత్ర. అందరం అంకిత భావంతో విధులు నిర్వహించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కుంభమేళాకు వచ్చిన యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి."

-తీరథ్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రావత్​ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం గమనార్హం.

ఇదీ చదవండి : ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ సింగ్​​ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.