ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయానికి ఓ భక్తుడు 8 కిలోల ఆభరణాలను (బంగారం, వెండి) కానుకగా ఇచ్చాడు.
తన పేరు సహా ఏ వివరాలు చెప్పకుండా వాటిని సమర్పించుకోవడం గమనార్హం.
అందులో 4.8 కిలోల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు పూరీ జగన్నాథ్ ఆలయ అధికారులు వెల్లడించారు.
దాత తరఫున ఓ ప్రతినిధి కానుకలు అందించినట్లు తెలిపారు ఆలయ సిబ్బంది. తన ఆనవాళ్లు తెలపొద్దని కోరినట్లు వివరించారు.
ఇదీ చదవండి:ప్రకృతి శాపం.. మనిషిదీ పాపం!